Monday, November 03, 2008

ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ
ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ
కలిపింది ఏ వింత అనుబంధమవునో
-- అప్పుడెన్న?
-- అర్థం కాలేదా?

ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానమవునో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
-- ఆహ అప్పుడియా
-- పెద్ద అర్థమైనట్టు

భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది

వయసే వయసును పలకరించింది
వలదన్నా అది నిలువకున్నది
-- ఏ నీ రొంబ అళ్ళారికె
-- ఆహ్ రొంబ? అంటే?

ఎల్లలు ఏవీ ఒల్లనన్నది
నీదీ నాదొక లొకమన్నది
నీదీ నాదొక లొకమన్నది

తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
-- నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా
మొదటి కలయికే ముడి వేసినది
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది

***

చిత్రం : మరో చరిత్ర
గానం : P సుశీల, కమల్ హాసన్
సంగీతం : M S విశ్వనాథన్
రచన : ఆత్రేయ

2 comments:

kiraN said...

నాకు నచ్చిన పాటల్లో ఇదీ ఒకటి..

-కిరణ్

Sky said...

నమస్కారం చైతన్య గారు,
మీరు అప్పుడప్పుడూ ఆలస్యం గా update చేసినా మనసును అనుభూతులతో నింపే పాటలను వదులుతున్నారు. విశ్వనాథన్ గారి అద్భుతమైన బాణీలలో ఇది ఒకటి. సుస్స్వరాల సుశీల గారు పాడిన పాట కూడా కావటం, దానికి కమల్ హాసన్ అభినయం వెరసి ఈ అద్భుతమైన బాణీ. చాలా మందికి ఇది నచ్చిన పాట.

ఇంకా మంచి మంచి పాటలు చాలా వున్నాయండి. వీలు చూసుకుని అవి కూడా update చేసెయ్యండి.

నేను నా బ్లాగ్ లో కొన్ని పాటలు కేవలం డౌన్లోడ్ మాత్రమే చేసుకునేలా upload చెయ్యబోతున్నాను. ఘంటసాల, సాలూరి, జిక్కి, మంగళంపల్లి, సుశీల,జానకి,విశ్వనాధ్,బాలు, సుబ్బలక్ష్మి గారి పాటలు త్వరలో upload చెయ్యబోతున్నాను.

నా బ్లాగ్ ని మీ బ్లాగ్ లో add చేసుకున్నందుకు thanks

భవదీయుడు

సతీష్ యనమండ్ర