Thursday, April 30, 2009

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

శ్రీ శ్రీ గారి జన్మదిన సందర్భంగా...


పూర్తి పేరు: శ్రీరంగం శ్రీనివాసరావు
పుట్టిన తేది: ఏప్రిల్ 30, 1910
పుట్టిన స్థలం: విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
మరణం: జూన్ 15, 1983
వృత్తి: కవి, గేయ రచయిత
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా

బడులే లేని పల్లెటూళ్ళలో
బడులే లేని పల్లెటూళ్ళలో
చదువే రాని పిల్లలకు
చదువు రాని చదువుల బడిలో
జీతాలు రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

చాలీ చాలని పూరి గుడిసెలో
చాలీ చాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలి అయిపోయిన పడతులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

కూలి డబ్బుతో లాటరీ టికెట్
లాటరీ టికెట్
కూలి డబ్బుతో లాటరీ టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరిచి
చెడే నిరాశా జీవులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

సేద్యం లేని బీడు నేలలో
సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

***

చిత్రం: భూమి కోసం
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల

Thursday, April 23, 2009

అరె ఏమైందీ

ఎస్ జానకి గారి పుట్టినరోజు సందర్భంగా...

పూర్తి పేరు: ఎస్ జానకి
జన్మదినం: 23 ఏప్రిల్ 1938
పుట్టిన స్థలం: రేపల్లె, గుంటూరు జిల్లా
మొదటి పాట\చిత్రం : విధియిన్ విలయత్తు, తమిళ్ (1957)

***అరె ఏమైందీ
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ

నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది
పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు వేరు
నింగి వైపు చూపు వేరు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ

ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడూ

అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది

***

చిత్రం: ఆరాధన (1982)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Friday, April 10, 2009

ఎవ్వరో పాడారు భూపాల రాగంDownload Song

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం

ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో గంఠా నాదం
ఇది నా తొలి నైవేద్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై

వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

***

చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: M S విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: S P బాల సుబ్రహ్మణ్యం

Monday, April 06, 2009

ఊగిసలాడకె మనసాDownload Song

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో ఆశగా ఉందనో
ఉర్రూతలూగకే మనసా

తలలోన ముడిచాక విలువైన పూవైన
దైవపూజకు తగదు మనసా (2) ||తలలోన||
పొరపాటు చేసావో దిగాజారిపోతావు
నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు మొదటికే మోసాలు
చాలు నీ వేషాలు మనసా (2)

||ఊగిసలాడకె||

తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను
దిమ్మరిని నమ్మకే మనసా
దేశదిమ్మరిని నమ్మకే మనసా ||తుమ్మెదలు||
చపల చిత్తము విపరీతమవుతుంది
చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు కవ్వింపు సరసాలు
కాలు జారేనేమో మనసా (2)

||ఊగిసలాడకె||

***

చిత్రం: కొత్త నీరు
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: P సుశీల

Friday, April 03, 2009

ముందు తెలిసినా ప్రభూ!

జయప్రదగారి జన్మదిన సందర్భంగా...

పేరు: జయప్రద
పుట్టిన తేది: ౩ ఏప్రిల్, ౧౯౬౨ (3 ఏప్రిల్ 1962)
పుట్టిన స్థలం: రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
తోలి చిత్రం: భూమి కోసం (3 నిముషాల పాట, నాట్యం)
వృత్తి: నటి, రాజకీయవేత్త


Download Song

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

***

చిత్రం: మేఘ సందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: P సుశీల