Friday, November 30, 2018

పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

ఊహలు ఊరేగే గాలంతా 
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ  సమయానికి తగు మాటలు  ఏమిటో  ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా  భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!
   పొరబడిపోకు అంతలా .. నను అడిగావ ముందుగా!
నేనేదో భ్రమలో ఉన్నానేమో.. నీ చిరునవ్వేదో చెబుతోందని !
   అది నిజమే అయినా నాతో అనకు ... నమ్మలేనంతగా!

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

తగదు సుమా అంటూ ఉంటే ... తలపు దుమారమాగదే  !
  తొలిదశలో అంతా ఇంతే .. కలవరపాటు తేలదే !
ఈ బిడియం గడియే  తెరిచేదెపుడో .. నా మదిలో మాట తెలిపేందుకు!
  నిన్నిదిగో  ఇదదే అనుకోమనకు ఆశలే రేపగా!

ఊహలు ఊరేగే గాలంతా 
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ  సమయానికి తగు మాటలు  ఏమిటో  ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

***

చిత్రం:  సమ్మోహనం 
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం:హరిచరణ్ , కీర్తన 
సంగీతం: వివేక్ సాగర్