Wednesday, November 12, 2008

రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాగాల పల్లకిలో కోయిలమ్మా
రాలేదు ఈవేళ ఎందుకమ్మా

నా ఉద్యోగం పోయిందండీ...
తెలుసు... అందుకే...


రాలేదు ఈవేళ కోయిలమ్మా
రాగాలే మూగబోయినందుకమ్మా

రాగాల పల్లకిలో కోయిలమ్మా
రాలేదు ఈవేళ ఎందుకమ్మా
రాలేదు ఈవేళ కోయిలమ్మా
రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా
రాలేదు ఈవేళ ఎందుకమ్మా ఎందుకమ్మా

పిలిచిన రాగమే పలికిన రాగమే
కూనలమ్మకీ
మూగ తీగ పలికించే
వీణలమ్మకీ ||పిలిచిన||
బహుశా అది తెలుసో ఏమో
బహుశా అది తెలుసో ఏమో
జాణ కోయిల
రాలేదు ఈ తోట కి ఈవేళ

రాగాల పల్లకిలో కోయిలమ్మా
రాలేదు ఈవేళ అందుకేనా అందుకేనా

గుండెలో బాధలే గొంతులో పాటలై
పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి
పాడినప్పుడు ||గుండెలో||
బహుశా తను ఎందుకనేమో
బహుశా తను ఎందుకనేమో
గడుసు కోయిల
రాలేదు ఈ తోట కి ఈవేళ

రాగాల పల్లకిలో కోయిలమ్మా
రానేల నీవుంటే కూనలమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మా
రానేల నీవుంటే కూనలమ్మ

***

చిత్రం : శుభలేఖ
సంగీతం : K V మహదేవన్
రచన : వేటూరి
గానం : S P బాల సుబ్రమణ్యం, P సుశీల

Monday, November 03, 2008

ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ




ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ
కలిపింది ఏ వింత అనుబంధమవునో
-- అప్పుడెన్న?
-- అర్థం కాలేదా?

ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినొ
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానమవునో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
-- ఆహ అప్పుడియా
-- పెద్ద అర్థమైనట్టు

భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది

వయసే వయసును పలకరించింది
వలదన్నా అది నిలువకున్నది
-- ఏ నీ రొంబ అళ్ళారికె
-- ఆహ్ రొంబ? అంటే?

ఎల్లలు ఏవీ ఒల్లనన్నది
నీదీ నాదొక లొకమన్నది
నీదీ నాదొక లొకమన్నది

తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
-- నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా
మొదటి కలయికే ముడి వేసినది
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది

***

చిత్రం : మరో చరిత్ర
గానం : P సుశీల, కమల్ హాసన్
సంగీతం : M S విశ్వనాథన్
రచన : ఆత్రేయ