Thursday, October 18, 2012

మూసుకున్న రెప్పలిరిసి చూపులెగరనీయండి

తెల్లారింది లెగండో ... కో క్కో రో కో 

తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో
పాములాంటి సీకటి పడగ దించి పోయింది 
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి
చావులాటి రాతిరి చూరు దాటి పోయింది
భయం నేదు భయం నేదు చాపలు సుట్టేయండి 
ముడుచుకున్న రెక్కలిరిచి పిట్ట చెట్టు ఇడిసింది
ముడుచుకున్న రెక్కలిరిచి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి చూపులెగరనీయండి  
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో

చురుకు తగ్గిపోయింది చందురూడి కంటికి  
చులకనైపోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం
ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారిపోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్ను మిన్ను 
కాలం కట్టిన గంతలు దీసి కాంతుల ఎల్లువ గంతులు యేసి
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో

ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం 
ఎగ్గుబెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం   

కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ  
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల పీడా 
చమట బొట్టు సమురుగా సూరీడ్ని ఎలిగిద్దాం 
ఎలుగుచెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ చెట్టుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు జేసి
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో

***
చిత్రం: కళ్ళు
గానం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: S P బాలసుబ్రమణ్యం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి



Tuesday, October 16, 2012

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరు నవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక


ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

***

చిత్రం: అమెరికా అమ్మాయి
సంగీతం: GK వెంకటేష్
గానం: G ఆనంద్
రచన: మైలవరపు గోపి


Tuesday, October 09, 2012

పరువమా చిలిపి పరుగు తీయకు

పరువమా చిలిపి పరుగు తీయకు..
పరువమా చిలిపి పరుగు తీయకు..
పరుగులో పంతాలు పోవకు..
పరుగులో పంతాలు పోవకు..
పరువమా చిలిపి పరుగు తీయకు..

ఏ ప్రేమ కోసమో చూసే చూపులు..
ఏ కౌగిలింతకో చాచే చేతులు..
తీగలై హొ చిరు పూవులై పూయ..
గాలిలో హొ రాగాలుగా మ్రోగ..
నీ గుండె వేగాలు తాళం వేయ..

పరువమా చిలిపి పరుగు తీయకు..

ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో..
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో..
వెతికితే హొ నీ మనసులో లేదా..
దొరికితే హ జత కలుపుకోరాదా..
అందాక అందాన్ని ఆపేదెవరు..

పరువమా చిలిపి పరుగు తీయకు..




***

చిత్రం: మౌన గీతం
సంగీతం: ఇళయరాజా
రచన: ఆత్రేయ
గానం: S P బాలసుబ్రహ్మణ్యం, S జానకి