సావిత్రి
జననం : 6 Dec 1937
మరణం : 26 Dec 1981
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ (M) చిట్టెమ్మ (F)
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా (M) చెప్పమ్మా (F)
ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా చెప్పమ్మా
అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది (F) వయసువుంది (M)
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా (F) కిట్టయ్యా (M)
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య (F) చెప్పయ్య (M)
అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య
(Male)
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
అత్తవరింతినిండా వేసినా
అవి అభిమానమంత విలువచేసున
అభిమానమంత విలువచేసున
ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా చెప్పమ్మా
(Female)
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం
గుణము మంచిదైతే చాలయ
మన గొప్పతనము చెప్పుకోను వీలయ
గొప్పతనము చెప్పుకోను వీలయ
అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య
(Male)
కాలు చేయి లోపమని కొక్కేరాయి రూపమని
కాలు చేయి లోపమని కొక్కేరాయి రూపమని
వదినలు నన్ను గేలి చేతురా
పిల్లను తెచ్చి పెళ్లి చేతురా
పిల్లను తెచ్చి పెళ్లి చేతురా
(Female)
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
నమ్మిన నాపచేనే పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా
అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య
ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా
***
చిత్రం: కలిసి ఉంటే కలదు సుఖము
గానం: ఘంటసాల , P సుశీల
రచన : కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు