నిజమేనని నమ్మనీ
అవునా అనే మనసునీ
మనకోసమే ఈ లోకం అనీ
నిజమేనని నమ్మనీ
కనుపాపలోనీ ఈ కలల కాంతీ
కరిగేది కానే కాదనీ
గత జన్మలన్నీ మరు జన్మలన్నీ
ఈ జన్మ గానే మారనీ
ఈ జంటలోనే చూడనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ
కాలం అనేదే లేని చోటా
విలయాల పేరే వినని చోటా
మనం పెంచుదాం ఏకమై
ప్రేమగా ప్రేమనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ
***
చిత్రం: కంచె
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్ భట్
గానం: శ్రేయా గోషల్