Friday, July 25, 2008

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా...

Listen to Dance Master - telugu Audio Songs at MusicMazaa.com

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడ లేదనీ
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకునే ప్రేమ
నీ పిలుపే నిలిచే వలపై
పెదవుల్లో దాగి

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయె మనులే పొంగే
ముద్దాడ సాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లెపూల వాసన
సొగసులే సోకిన వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో
ఎద లేడై లేచి

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా


***
చిత్రం : డాన్స్ మాస్టర్
సంగీతం : ఇళయరాజా
గానం : SP బాలు