Wednesday, November 07, 2007

లిపి లేని కంటి బాస

Listen to Srivariki Premalekha Audio Songs at MusicMazaa.com

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాశలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను

బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

***

చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి
గానం : S P బాలసుబ్రమణ్యం, జానకి