Thursday, June 21, 2007

ప్రపంచ సంగీత దినోత్సవం

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం . సంగీత ప్రియులందరికీ నా శుభాకాంక్షలు :-)

ఈ సందర్భం గా ఒక రాగం...

***

Listen to Aalaapana - telugu Audio Songs at MusicMazaa.com

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాల

ఆవేశమంతా

నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం
నిదురలేచె నాలో హౄదయమే

ఆవేశమంతా

సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగసగమగమ నిసనిస గమగపదనిస
జలకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలిపించం
ఎదలు కలిపి నాలో విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా

ఆవేశమంతా

***

చిత్రం : ఆలాపన (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి (అనుకుంటున్నాను)
గానం : బాలు

Sunday, June 17, 2007

హ్యాపీీ బర్త్ డే టూ యు డియర్

జాబిలమ్మ చేరవస్తే కోపమేల చిన్నవాడా
కోనలమ్మా కోరుకుంది చిరునవ్వు ఈవేళా
హ్యాపీీ బర్త్ డే టూ యు డియర్
హ్యాపీ బర్త్ డే టూ యు డియర్
హ్యాపీ బర్త్ డే టూ యు డియర్
జాబిలమ్మ చేరవస్తే కోపమేల చిన్నవాడా
కోనలమ్మా కోరుకుంది చిరునవ్వు ఈవేళా

స్నేహమే జీవితమని తలచే చెలిమి నీదేననీ
మనసులో మమకారం పంచే హితుడు నీవేననీ
స్నేహమే జీవితమని తలచే చెలిమి నీదేననీ
మనసులో మమకారం పంచే హితుడు నీవేననీ
తలచి చేరా నీ దరీ వీడబోను నమ్మనీ
హ్యాపీీ బర్త్ డే టూ యు డియర్
హ్యాపీ బర్త్ డే టూ యు డియర్
హ్యాపీ బర్త్ డే టూ యు డియర్
జాబిలమ్మ చేరవస్తే కోపమేల చిన్నవాడా
కోనలమ్మా కోరుకుంది చిరునవ్వు ఈవేళా

కమ్మసాగే పాటకి నీవే పల్లవి కావాలనీ
రమ్మని పిలిచే వసంతాలలో చల్లగ సాగాలనీ
కమ్మసాగే పాటకి నీవే పల్లవి కావాలనీ
రమ్మని పిలిచే వసంతాలలో చల్లగ సాగాలనీ
పలికే వేణుగానమా నీ పలుకే బంగారమాయెనా
హ్యాపీ బర్త్ డే టూ యు డియర్
హ్యాపీ బర్త్ డే టూ యు డియర్
హ్యాపీీ బర్త్ డే టూ యు డియర్
జాబిలమ్మ చేరవస్తే కోపమేల చిన్నవాడా
కోనలమ్మా కోరుకుంది చిరునవ్వు ఈవేళా

***

చిత్రం - నీలి మేఘాలు
సంగీతం - దుగ్గిరాల
సాహిత్యం -
గానం - నిత్య సంతోషిణి

గమనిక: ఈ పాట వినటానికి టైటిల్ పై క్లిక్ చేయండి