పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
***
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: M S విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: S P బాల సుబ్రహ్మణ్యం