నాలో నేనేనా... ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
నాలో నేనేనా... ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోనా
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ మాటే నీదీ
ఇదేం మాయో!
అవునో కాదో తడబాటునీ
అంతో ఇంతో గడి దాటనీ
విడి విడి పోనీ పరదాని
పలుకై రానీ ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపనా
మనసే నాదీ మాటే నీదీ
ఇదేం మాయో!
నాలో నేనేనా... ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హౄదయాన్నీ
చిగురై పోని శిశిరాన్నీ
నీతో చెలిమి చేస్తున్న నిముషాలు
నూరెళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం
ప్రేమే బంధం!
***
చిత్రం: బాణం
గానం: హేమచంద్ర, సైంధవి
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి