Monday, February 11, 2019

మన మట్టి మీద పగబట్టి ఎవరు గీసారో సరిహద్దులు!






ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా
మెహబూబా ... మెహబూబా ..
ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా
మెహబూబా ...

ప్రేమలో పడ్డామనే లోపల
కళ్ళకీ కన్నీరేంటో కాపలా!
నువ్వు దగ్గరుంటే ఏ యుద్ధమైన
నిశ్శబ్దమిణ్ణాళ్ళుగా!
నువ్వు దూరమైతే నిశ్శబ్దమైన
ప్రతి రోజు యుద్ధం కదా!
మెహబూబా ... మెహబూబా ..
ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా

లేవులే ఏ గాలికీ ఆంక్షలే
నింగికి లేనేలేవు ఎల్లలే !
మన మట్టి మీద పగబట్టి
ఎవరు గీసారో సరిహద్దులు!
ప్రేమంటే ఏంటో తెలిసుంటె వాళ్ళు
ఈ గీత గీసుండరు!
మెహబూబా ... మెహబూబా ..
ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా
మెహబూబా ... మెహబూబా ..

***

చిత్రం: మెహబూబా
గానం: ప్రగ్యా దాస్ గుప్తా , సందీప్ బాత్రా
సంగీతం: సందీప్ చౌతా
రచన: భాస్కరభట్ల

Thursday, December 06, 2018



సావిత్రి 
జననం  :  6 Dec 1937
మరణం :  26 Dec 1981


ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి (M) జడను చుట్టి (F)
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ (M) చిట్టెమ్మ (F)
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా (M) చెప్పమ్మా (F)

ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా చెప్పమ్మా

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది (F) వయసువుంది (M)
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా (F) కిట్టయ్యా (M)
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య (F) చెప్పయ్య (M)

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య

(Male)
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
అత్తవరింతినిండా వేసినా
అవి అభిమానమంత విలువచేసున
అభిమానమంత విలువచేసున

ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా చెప్పమ్మా

(Female)
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం
గుణము మంచిదైతే చాలయ
మన గొప్పతనము చెప్పుకోను వీలయ
గొప్పతనము చెప్పుకోను వీలయ

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య

(Male)
కాలు చేయి లోపమని కొక్కేరాయి రూపమని
కాలు చేయి లోపమని కొక్కేరాయి రూపమని
వదినలు నన్ను గేలి చేతురా
పిల్లను తెచ్చి పెళ్లి చేతురా
పిల్లను తెచ్చి పెళ్లి చేతురా

(Female)
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
నమ్మిన నాపచేనే పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య

ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా

***

చిత్రం:  కలిసి ఉంటే కలదు సుఖము
గానం: ఘంటసాల , P సుశీల
రచన : కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు 

Wednesday, December 05, 2018

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే





ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాశ ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలక జట్టే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలకా.. చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే
మౌనములోని మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వీలేలేని పంతం వదిలి పలకవటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునక గాలే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్

ముడిపడిపోయామొక్కటిగా విడివడిపోలేకా
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక
పదునుగా నాటే మన్మధ బాణం నేరం ఏమీ కాదు కదే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్

***

చిత్రం: చెలియా
సంగీతం: A R రెహ్మాన్
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: అభయ్ జోద్పూర్కర్ , చిన్మయి


Friday, November 30, 2018

పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!





ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

ఊహలు ఊరేగే గాలంతా 
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ  సమయానికి తగు మాటలు  ఏమిటో  ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా  భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!
   పొరబడిపోకు అంతలా .. నను అడిగావ ముందుగా!
నేనేదో భ్రమలో ఉన్నానేమో.. నీ చిరునవ్వేదో చెబుతోందని !
   అది నిజమే అయినా నాతో అనకు ... నమ్మలేనంతగా!

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

తగదు సుమా అంటూ ఉంటే ... తలపు దుమారమాగదే  !
  తొలిదశలో అంతా ఇంతే .. కలవరపాటు తేలదే !
ఈ బిడియం గడియే  తెరిచేదెపుడో .. నా మదిలో మాట తెలిపేందుకు!
  నిన్నిదిగో  ఇదదే అనుకోమనకు ఆశలే రేపగా!

ఊహలు ఊరేగే గాలంతా 
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ  సమయానికి తగు మాటలు  ఏమిటో  ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

***

చిత్రం:  సమ్మోహనం 
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం:హరిచరణ్ , కీర్తన 
సంగీతం: వివేక్ సాగర్ 

Sunday, May 13, 2018

కాలం నర్తించదా నీతో జతై .. ప్రాణం సుమించదా నీ కోసమై !!





సదా నన్ను నడిపే.. నీ చెలిమే  పూదారై నిలిచే
ప్రతీ మలుపు ఇకపై.. స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా
ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే !

కాలం నర్తించదా నీతో జతై..
ప్రాణం సుమించదా నీ కోసమై!
కాలం నర్తించదా  నీతో జతై!!

నదికి వరదల్లే
మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో!
తలపు తొలిజల్లై
తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో!
గమనించేలోగా..
గమకించే రాగానా ..
ఎదో వీణ లోన మోగేనా !

కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీ కోసమై
కాలం నర్తించదా  నీతో జతై !!

***

చిత్రం: మహానటి
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చారులత మణి

Tuesday, March 28, 2017

కనుపాపలోనీ ఈ కలల కాంతీ కరిగేది కానే కాదనీ ... !!



నిజమేనని నమ్మనీ
అవునా అనే మనసునీ
మనకోసమే ఈ లోకం అనీ
నిజమేనని నమ్మనీ

కనుపాపలోనీ ఈ కలల కాంతీ
కరిగేది కానే కాదనీ
గత జన్మలన్నీ మరు జన్మలన్నీ
ఈ జన్మ గానే మారనీ
ఈ జంటలోనే  చూడనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ

కాలం అనేదే లేని చోటా
విలయాల పేరే వినని చోటా
మనం పెంచుదాం ఏకమై
ప్రేమగా ప్రేమనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ

***

చిత్రం: కంచె
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: శ్రేయా గోషల్



Saturday, June 04, 2016

ఏ నాడు విడిపోని ముడి వేసేనే





జూన్ 4th
S P బాలసుబ్రమణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా ..

ఏ నాడు విడిపోని ముడి వేసేనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు 
ఈ సుధల ఆమనిని
ఏ నాడు విడిపోని ముడి వేసేనే ఏ నాడు విడిపోని ముడి వేసేనే

మొహాన పారాడు వేలి కొనలు
నీ మేను  కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయమూ
కలకాలమూ కలగానమై నిలవాలి మన కోసము
ఈ మమత
ఏ నాడు విడిపోని ముడి వేసేనే
ఏ నాడు విడిపోని ముడి వేసేనే

నీ మోవి మౌనాన మదనరాగం
మొహాన సాగే మదుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు వీసె వేణు నాదం
పాపలుగా వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే చేరింది మన జంటకు
ముచ్చటగా

***

చిత్రం: శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్
సంగీతం: ఇళయరాజా
గానం: S P బాలసుబ్రమణ్యం , జానకి



Tuesday, May 17, 2016

యెక్కిరించు రేయిని సూసి యెర్రబడ్డ ఆకాశం... యెగ్గు పెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం





తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

పాములాంటి సీకటి పడగ దించిపోయింది
భయంనేదు భయంనేదు నిదుర ముసుగు తీయండి
సావులాటి రాతిరి సూరు దాటిపోయింది భయంనేదు భయంనేదు సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండీ 

తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

సురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
సులకనై పోయింది లోకం సీకటికి
కునుకు వచ్హి తూగింది సల్లబడ్డ దీపం
యెనక రెచ్హిపోయింది అల్లుకున్న పాపం
మసక బారిపోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి కాంతుల యెల్లువ గంతులు యెసి

తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

యెక్కిరించు రేయిని సూసి యెర్రబడ్డ ఆకాశం
యెగ్గు పెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల పీడ
సెమట బొట్టు సమురుగా సూరీడ్ని యెలిగిద్దాం
యెలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వేకువ సక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు సేసి

తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

***

చిత్రం: కళ్ళు 
సంగీతం:  S P బాల సుబ్రహ్మణ్యం 
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 

Tuesday, April 19, 2016

పల్లవించవా నా గొంతులో.. పల్లవికావా నా పాటలో..





పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే.. ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని.. నీ పూజకి నిలయాన్ని
నీ వీణకి నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో
ప్రణయ సుధారాధా.. నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవికావా నా పాటలో

***

చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: M S విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: S P బాల సుబ్రహ్మణ్యం

Thursday, December 10, 2015

నీతో చెలిమి చేస్తున్న నిముషాలు.. నూరెళ్ళుగా ఎదిగిపోయాయిలా!






నాలో నేనేనా... ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
నాలో నేనేనా... ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోనా
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ మాటే నీదీ
ఇదేం మాయో!

అవునో కాదో తడబాటునీ
అంతో ఇంతో గడి దాటనీ
విడి విడి పోనీ పరదాని
పలుకై రానీ ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపనా
మనసే నాదీ మాటే నీదీ
ఇదేం మాయో!

నాలో నేనేనా... ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హౄదయాన్నీ
చిగురై పోని శిశిరాన్నీ
నీతో చెలిమి చేస్తున్న నిముషాలు
నూరెళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం
ప్రేమే బంధం!


***

చిత్రం: బాణం
గానం: హేమచంద్ర, సైంధవి
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

Wednesday, December 09, 2015

అడగనిదే చెప్పేది ఎలా.. చెప్పనిదే తెలిసేది ఎలా..





అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా
అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా
అవును అనో నువు కాదు అనో తెలపాలి కదా
i love you i love you
i love you i love you

అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా

ఏవో ఊహల్లో ఎన్నాళ్ళని తిరగాలి
ఎదరే నువ్వున్నా కలలెందుకు చూడాలి
నాలగా నీలోనూ ఈ ప్రశ్నలు చూసాను
కొంటె సైగల చాటుగా కంచె దాటని కోరిక
ముందడుగేయదు ఎందుకు అంటే ఏమనను!

అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా

నీతో నేనేదో అందామనుకుంటున్నా
వేరే ఇంకేదో అంటూ గడిపేస్తున్నా
ఏ మంత్రం వేసావో మైకంలో తోసావో
నిన్నిలా చూస్తుండగా మాటలేవీ తోచక
గుండెలోగల సంగతెలా పైకనగలను

అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా
అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా
అవును అనో నువు కాదు అనో తెలపాలి కదా
i love you i love you
i love you i love you

అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా

***

చిత్రం: శివ 2006
గానం: సునిత, విజయ ప్రకాష్
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల




Tuesday, December 08, 2015

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని!






I am in love I am in love I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితె మేఘాలు ఉరిమితె
మనసులో నువ్వే
ఆ నింగి కరిగితె ఈ నేల చేరిన
చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

I am in love I am in love I am in love with you
కనులలొ దాచిన కావ్యమే నువ్వు

కోటి కలలను గుండె లోతులొ దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వే నా వయ్యారి
నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి
నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు  నువ్వై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకుంటే హాయి
నిను నేను చేరుకుంటే హాయి

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మ్రుదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్ని చూడాలి
నే నీలో నిండి పోవాలి
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో
నిలువెల్లా నేనే తడవాలి
నాలోని ప్రేమ యేనాటికైనా నీకే అంకితమవ్వనీ
నీకే అంకితమవ్వనీ

I am in love I am in love I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితె మేఘాలు ఉరిమితె
మనసులో నువ్వే
ఆ నింగి కరిగితె ఈ నేల చేరిన
చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే


***

చిత్రం: సత్యం
సంగీతం: చక్రి
గానం: వేణు
సాహిత్యం: కందికొండ

Friday, December 04, 2015

ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమా!






ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమా
అర్ధంకాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమా
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమా
కలిసిన వెంటనె ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

***

చిత్రం: మనసంతా నువ్వే
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె కె
సంగీతం:  R P పట్నాయక్

Wednesday, November 18, 2015

ఎవరైనా చూసారా...



ఎవరైనా చూసారా...

ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
గారంగా కొసరే వేళ ... కారంగా కసిరే వేలా
గుండెల్లో జరిగే గోలా... మౌనంగా ఉంటే మేలా...
ఎవరైనా చూసారా...  పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా

అప్పుడప్పుడీ ఉపవాసం ...తమ అలవాటా ...
కోరుకుంటె  నా సహవాసం... ఏం పొరపాటా ...
ఒహో ఏమా రోషం ... వామ్మో సమరావేసం
కొరికేసే ఉక్రోషం...
కరిగించే సరసం కోసం ... అడిగేస్తే ఏమిటి దోషం
ఇష్టమంత ఉగ్గబట్టి ఎందుకంత మొగమాటం

ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా

లేనిపోని సైగలు చేసి నను లాగాలా..
చేరగానే వెనకడుగేసి వెటకారాలా
లోలో సరదా లేదా... పై పై పరదాలేలా
తగువేలా నాతో తగువేలా
బిగువేలా ఇంకా బిడియాలా
గుట్టే దాచాలన్నా దాగేనా

ఎవరైనా చూసారా...  పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
ఎర  వేసే అల్లరి ఈల...  పొరపాటే అయిపోవాలా
దరి దాటే వరదయ్యేలా...  పరుగెడితే పడవా బాల
ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా


***

చిత్రం:  ఇష్టం
గానం:  హరిహరన్, చిత్ర
సంగీతం : గోపీనాథ్
సాహిత్యం: ??

Friday, March 28, 2014

మేఘంలో నిద్దుర పోయిన... రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే!

ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల
అందించే ఆహ్వనం ప్రేమంటే...
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడి గానం ప్రేమంటే...
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం!
దాహంలో మునిగిన చివురుకి... చల్లని తన చెయ్యందించి
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే!
మేఘంలో నిద్దుర పోయిన... రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే!

ఘల్ ఘల్...

ప్రాణం ఎపుడు మొదలైందో...
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హౄదయంలో...
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే!
అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే!
దరి దాటి ఉరకలు వేసే యే నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే!
సిరి  పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే!

ఘల్ ఘల్...

మండే కొలిమినడగందే...
తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే...
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరి చేరే ప్రియురాలే గెలుపంటే!
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకి తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే!
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా!
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా!

***

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా
గానం: S P బాలసుబ్రమణ్యం
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

Tuesday, February 11, 2014

నింగీ నేల ఏకంకాగా... ఈ క్షణమిలాగె ఆగింది...

ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...
ఈ అనుభవం మరలా రానిది...
ఆనంద రాగం మోగింది... అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...

నింగీ నేల ఏకంకాగా... ఈ క్షణమిలాగె ఆగింది
నింగీ నేల ఏకంకాగా... ఈ క్షణమిలాగె ఆగింది
ఒకటే మాటన్నదీ... ఒకటైపొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ... అది నా సొమ్మన్నదీ
పరువాలు మీటి... సెలయేటి తోటి...
పాడాలి నేడు... కావాలి తోడు

ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...

సూర్యుని మాపి... చంద్రుని ఆపి... వెన్నెల రోజంతా కాచింది
సూర్యుని మాపి... చంద్రుని ఆపి... వెన్నెల రోజంతా కాచింది
పగలూ రేయన్నదీ... అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ... నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ... ఎదగాలి బాసై
కలవాలి నీవు... కరగాలి నేను

ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...
ఈ అనుభవం మరలా రానిది...
ఆనంద రాగం మోగింది... అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...

***

చిత్రం: ప్రేమ
గానం: S P బాలసుబ్రమణ్యం, చిత్ర
రచన: వేటూరి
సంగీతం: ఇళయరాజా

Thursday, October 18, 2012

మూసుకున్న రెప్పలిరిసి చూపులెగరనీయండి

తెల్లారింది లెగండో ... కో క్కో రో కో 

తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో
పాములాంటి సీకటి పడగ దించి పోయింది 
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి
చావులాటి రాతిరి చూరు దాటి పోయింది
భయం నేదు భయం నేదు చాపలు సుట్టేయండి 
ముడుచుకున్న రెక్కలిరిచి పిట్ట చెట్టు ఇడిసింది
ముడుచుకున్న రెక్కలిరిచి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి చూపులెగరనీయండి  
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో

చురుకు తగ్గిపోయింది చందురూడి కంటికి  
చులకనైపోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం
ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారిపోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్ను మిన్ను 
కాలం కట్టిన గంతలు దీసి కాంతుల ఎల్లువ గంతులు యేసి
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో

ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం 
ఎగ్గుబెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం   

కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ  
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల పీడా 
చమట బొట్టు సమురుగా సూరీడ్ని ఎలిగిద్దాం 
ఎలుగుచెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ చెట్టుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు జేసి
తెల్లారింది లెగండో ... కో క్కో రో కో
మంచాలింక దిగండో ... కో క్కో రో కో

***
చిత్రం: కళ్ళు
గానం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: S P బాలసుబ్రమణ్యం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి



Tuesday, October 16, 2012

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరు నవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక


ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

***

చిత్రం: అమెరికా అమ్మాయి
సంగీతం: GK వెంకటేష్
గానం: G ఆనంద్
రచన: మైలవరపు గోపి


Tuesday, October 09, 2012

పరువమా చిలిపి పరుగు తీయకు

పరువమా చిలిపి పరుగు తీయకు..
పరువమా చిలిపి పరుగు తీయకు..
పరుగులో పంతాలు పోవకు..
పరుగులో పంతాలు పోవకు..
పరువమా చిలిపి పరుగు తీయకు..

ఏ ప్రేమ కోసమో చూసే చూపులు..
ఏ కౌగిలింతకో చాచే చేతులు..
తీగలై హొ చిరు పూవులై పూయ..
గాలిలో హొ రాగాలుగా మ్రోగ..
నీ గుండె వేగాలు తాళం వేయ..

పరువమా చిలిపి పరుగు తీయకు..

ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో..
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో..
వెతికితే హొ నీ మనసులో లేదా..
దొరికితే హ జత కలుపుకోరాదా..
అందాక అందాన్ని ఆపేదెవరు..

పరువమా చిలిపి పరుగు తీయకు..




***

చిత్రం: మౌన గీతం
సంగీతం: ఇళయరాజా
రచన: ఆత్రేయ
గానం: S P బాలసుబ్రహ్మణ్యం, S జానకి

Friday, July 02, 2010

మనసా... కవ్వించకే నన్నిలా!




మనసా... కవ్వించకే నన్నిలా
ఎదురీదలేక కుమిలేను నేను
సుడిగాలిలో చిక్కిన నావను
మనసా... కవ్వించకే నన్నిలా!

ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా
ఈనాడు చీకటి లాగ మిగిలాను చీకటిలోనా
నేనోడిపోయి గెలుపొందినాను
నేనోడిపోయి గెలిపొందినాను
గెలిచానని నవ్వనా... ఏడ్వనా...
మనసా... కవ్వించకే నన్నిలా!

మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయే
గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే
తీవె
కైనా కావాలి తోడు
తీవె
కైనా కావాలి తోడు
నా జీవితం శాపమా పాపమా
మనసా... కవ్వించకే నన్నిలా!

***

చిత్రం: పండంటి కాపురం
గానం: P సుశీల
సంగీతం: కోదండపాణి
రచన: గోపి