Wednesday, December 05, 2018

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే





ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాశ ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలక జట్టే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలకా.. చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే
మౌనములోని మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వీలేలేని పంతం వదిలి పలకవటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునక గాలే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్

ముడిపడిపోయామొక్కటిగా విడివడిపోలేకా
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక
పదునుగా నాటే మన్మధ బాణం నేరం ఏమీ కాదు కదే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్

***

చిత్రం: చెలియా
సంగీతం: A R రెహ్మాన్
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: అభయ్ జోద్పూర్కర్ , చిన్మయి


No comments: