Friday, December 19, 2008

లేత చలిగాలులూ హోయ్ దోచుకోరాదురాలేత చలిగాలులూ హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులూ హోయ్ దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగాలేవులే
లేత చలిగాలులూ హోయ్ దోచుకోరాదురా

అందాల నా కురులతో వింజామరలు వీచనా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురల వీవనులకు నా హ్రుదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు హా హా
కలల భాష్యాలు లలలా హొహొహొ
వలపుగా సాగి
వలలుగా మూగి
కాలాన్ని బంధించగా ||లేత చలగాలులూ||

అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝరినై నిన్నే కోరనా
హ్రుదయ నాదాల ఆ ఆ
మధుర రాగాల హొహొహో లలలా
చిగురు సరసాల
నవ వసంతాల
విరులెన్నో అందించగా ||లేత చలిగాలులూ||

***

చిత్రం: మూడు ముళ్ళు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
రచన: జ్యోతిర్మయి
గానం: SP బాల సుబ్రమణ్యం, P సుశీల

Download

4 comments:

kiraN said...

ఇటువంటి మంచి పాటలు మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు చాలా సంతోషం.

"లేత చలిగాలిలూ.." కాకుండా "లేత చలిగాలులూ.." అనాలెమో.

--
కిరణ్
ఐతే OK

చైతన్య said...

థాంక్యూ కిరణ్... తప్పు సరిదిద్దాను :)

సుజ్జి said...

hi good song chaitu.. template baagundi. :)

kiraN said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)


-కిరణ్