Monday, August 21, 2006

ఇదే నా మొదటి ప్రేమ లేఖ



ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక
తెలుపుటకు భాష చేతకాక
తెలుపుటకు భాష చేతకాక

ఇదే నా

మెరుపనీ పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పువ్వనీ పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం
ఏ రీతిగ నిన్ను పిలవాలో తెలియదు నాకు
ఏ రీతిగ నిన్ను పిలవాలో తెలియదు నాకు
తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
ప్రేమ ప్రేమ ప్రేమ

ఇదే నా

తారవని అందామంటే నింగిలో మెరిసేవు
ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరి పోల్చాలో
ఎదలోన కదిలే నిన్ను దేనితో సరి పోల్చాలో
తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని
ప్రేమ ప్రేమ ప్రేమ

ఇదే నా


***

చిత్రం : స్వప్న
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆత్రేయ
గానం : S P బాలు

12 comments:

రానారె said...

ఇదీ రేడియో నుంచి విన్న పాటే.
ఇప్పుడు నెట్ వేసి పట్టుకున్నాను మళ్ళీ
http://www.chimatamusic.com/songlist_bestSolo.php

Anonymous said...

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తియ్యంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ నా వూపిరే నువ్వనీ
నీ..కు చెప్పాలని...

నేను అని లేను అనీ చెపితె ఏం చేస్తావు
నమ్మననీ నవ్వుకునీ చాల్లె పొమ్మంటావు

నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని శ్వాశగా తగిలేది నేనని
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటానని
తల ఆన్‌చి నీ గుండెపై నా పేరు వింటానని నీ...కు

చెప్పాలని...

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదని
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలి పోదని
ప్రతి ఘడియ ఓ క్షణముగా నే గడుపుతున్నానని
ఈ మహిమ నీదేనని నీకైన తెలుసునా అని నీ..కు

చెప్పాలని

ఒకే ఒక ఆశ

Anonymous said...

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తియ్యంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ నా వూపిరే నువ్వనీ
నీ..కు చెప్పాలని...

నేను అని లేను అనీ చెపితె ఏం చేస్తావు
నమ్మననీ నవ్వుకునీ చాల్లె పొమ్మంటావు

నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని శ్వాశగా తగిలేది నేనని
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటానని
తల ఆన్‌చి నీ గుండెపై నా పేరు వింటానని నీ...కు

చెప్పాలని...

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదని
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలి పోదని
ప్రతి ఘడియ ఓ క్షణముగా నే గడుపుతున్నానని
ఈ మహిమ నీదేనని నీకైన తెలుసునా అని నీ..కు

చెప్పాలని

ఒకే ఒక ఆశ

చైతన్య said...

ramanadha reddy gaaru...
avunu, enni saarlu vinnaa maLLI maLLI vinAlanipinchE paaTa :)

thanks for the link :)

anonymous...
paaTa baagundi, mee pEru cheptE inkA bAgunDEdi

Anonymous said...

ఛైతన్య గారు,
మంచి పాట ఎన్నుకున్నారు. సాహిత్యం, భావం, రాగం అన్నీ సమపాళ్ళల్లొ సమకూరాయి.
Telugubiz website లొ రచయితగా ఆత్రేయను వెటూరిని ఇద్దరినీ పెర్కొన్నారు. అసలు రచయిత ఎవరో నిర్ధారణ కాలేదు.

ఇటువంటి అద్భుతమైన భావమే కల హిందీ పాట ఒకటి మీతో పంచుకోవాలని అనిపించింది. అర్థసామీప్యత గమనించంచండి.

ఈ పాట రచయిత హస్రత్ జైపురి, ఈ పాటకు స్ఫూర్తి గురించి ఇచ్చిన వ్యాఖ్య మీరు ఎన్నుకొన్న పాటాకు అద్దం పట్టుతుంది.
(http://www.downmelodylane.com/hasrat.html)

Yeh Mera Prem Patra Padh Kar

Hindi Movie/Album Name: SANGAM
Singer: MOHD. RAFI

Lyrics:
Haseena Likhoon, Meherbaan Likhoon, Ya Dilruba Likhoon
Hairaan Hoon Ki Aap Ko Is Khat Mein Kya Likhoon
Yeh Mera Prem Patra Padh Kar
Ke Tum Naaraaz Na Hona
Ke Tum Meri Zindagi Ho
Ke Tum Meri Bandagi Ho

Tujhe Maein Chand Kehta Tha, Magar Usme Bhi Daag Hai
Tujhe Suraj Maein Kehta Tha, Magar Usme Bhi Aag Hai
Tujhe Itna Hi Kehta Hoon
Ki Mujhko Tumse Pyar Hai
Tumse Pyar Hai, Tumse Pyar Hai
Yeh Mera Prem Patra Padh Kar ...

Tujhe Ganga Maein Samjhoon Ga
Tujhe Jamuna Maein Samjhoon Ga
Tu Dil Ke Paas Hai Itni
Tujhe Apna Maein Samjhoon Ga
Agar Mar Jaoon Rooh Bhatke Gi
Tere Intezaar Mein, Intezaar Mein, Intezaar Mein
Yeh Mera Prem Patra Padh Kar ...

Best wishes

anveshi said...

hi Chaitanya
how r u?
vinAkaya chaviti Subhakanshalu.O bojja ganappayya pooja bAgA chesukunnara :)

chala rAgalu miss ayinattu vunnAnu :|hmm prema lEkha 8->

చైతన్య said...

karsha iti gaaru...
manchi paaTa gurtu cEsAru, anduku meeku dhanyavaadaalu.
nAku bAgA ishTamaina hindi paaTalalO idi kuDa okaTi.

ee renDu paaTalu sAhitya paramgA chAlA simple gaa unTaai, kAni enni sArlu vinna tanivi teeradu.

anveshi gaaru...
mEku kUDa vinAyaka chaviti subhAkAnkshalu :)

chAlA kAdulenDi.. okaTO renDO miss ayinaTTunnAru :)

kiraN said...

manchi paata. :)

- కిరణ్

Sudhakar said...

Nice song.. Nice blog as well..

anveshi said...

hi Chaitanya-
miss ayina rAgalani vinEsAnu.kotta
rAgam kOsam waiting...!

anveshi said...

knock ..knock...
kotta rAgam rAka eppuDu?

Anonymous said...

ఇదే మీ చివరిలేఖ కాదుకదా!!