Saturday, June 21, 2008

ప్రపంచ సంగీత దినోత్సవం

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం . సంగీత ప్రియులందరికీ నా శుభాకాంక్షలు :-)

ఈ సందర్భం గా ఒక రాగం...

***


ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే

***

చిత్రం : కన్నె వయసు
సంగీతం : సత్యం
గానం : S P బాలసుబ్రమణ్యం
రచన : ఆరుద్ర / దాసరథి

5 comments:

kiraN said...

సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా ఒక మంచి పాటని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

- కిరణ్
ఐతే OK [aithesare.blogspot]

kiraN said...

సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా ఒక మంచి పాటని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

- కిరణ్
ఐతే OK [aithesare.blogspot]

Anonymous said...

telugu sinimaa puTTinappaTinunchi ee rOju varaku vachchina sinimaa paaTlalO naaku nachchina paaTlanu oka lisT tayaaru chestE andulO eppaTiki modaTi sthaanamlO vunDE paaTa.

Thanks a lot.

MURALI said...

మంచిపాట లిరిక్స్ అందించారు. చాలా రోజులుగా వెతుకుతున్నా ధన్యవాదాలు.

Sky said...

నమస్కారం చైతన్య గారు,
నా బ్లాగ్ చూసినందుకు ధన్యవాదాలు. ఐ-న్యూస్ కార్యక్రమం ప్రసారం అయిపోయింది కాకపోతే దానిని ఎవ్వరూ రికార్డ్ చెయ్యలేదు. కానీ ప్రయత్నిస్తున్నాం.

H.M.T.V. లో కూడా మన ఈ-తెలుగు కార్యక్రమం రాబోతోంది. షూటింగ్ కాగానే తెలియ పరుస్తాను.

చాలా కాలానికి మళ్ళీ మీ బ్లాగ్ లోకి వచ్చాను. టెంప్లెట్ అదుర్స్....

మనసుకు నచ్చిన మంచి పాటలకై వెదుకుతూ ఏదో ఆలాపనగా ఈ పాట పాడుకుంటూ దీనికోసమే వెతికా... మొత్తానికి దొరికింది. మీ బ్లాగ్ లో నేను కావాలనుకున్న చాలా పాటలు దొరికాయి. మీ సంగీతాభిరుచికి అభినందనలు.

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర