Wednesday, September 24, 2008

అలివేణీ ఆణిముత్యమా...



అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమా
ఆవిరి చిగురో... ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో... జాలినవ్వు జాజిదండలో

అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రాణముత్యమా
జాబిలి చలువో... ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో... జాజిమల్లి పూలగుండెలో

అలివేణీ ఆణిముత్యమా...

కుదురైన బొమ్మకి... కులుకు మల్లెరెమ్మకి
కుదురైన బొమ్మకి... కులుకు మల్లెరెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా... బొట్టుగా
వద్దంటే ఒట్టుగా!

అందాల అమ్మకి... కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి... కుందనాల కొమ్మకి
అడుగుమడుగులొత్తనా... మెత్తగా
అవునంటే తప్పుగా!

అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రాణముత్యమా

పొగడలేని ప్రేమకి... పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి... పొన్నచెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా... పూజగా
పులకింతల పూజగా!

తొలిజన్మల నోముకి... దొరనవ్వుల సామికి
తొలిజన్మల నోముకి... దొరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా... చల్లగా
మరుమల్లెలు చల్లగా!

అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమా
జాబిలి చలువో... ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో... జాజిమల్లి పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...
అలివేణీ ఆణిముత్యమా...

***

చిత్రం : ముద్దమందారం
సంగీతం : రమేష్ నాయుడు
గానం : S P బాలసుబ్రమణ్యం, S జానకి
గీత రచన : వేటూరి

Wednesday, September 17, 2008

పిలిచిన మురళి కి వలచిన మువ్వకి

Listen to Ananda Bhairavi Audio Songs at MusicMazaa.com

పిలిచిన మురళి కి వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం
మురిసిన మురళికి మెరసిన మువ్వకి
ఎదలో ప్రేమ పరాగం మది ఆనంద భైరవి రాగం

కులుకే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే
కులుకే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే
మనసే మురళీ ఆలాపనలో మధురానగరిగ తోచే
యమునా నదిలా పొంగినది
స్వరమే వరమై సంగమమై

మురిసిన మురళికి మెరసిన మువ్వకి
ఎదలో ప్రేమ పరాగం మది ఆనంద భైరవి రాగం
పిలిచిన మురళి కి వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం

ఎవరీ గోపిక పద లయ వింటే ఎదలో అందియ మ్రోగే
పదమే సగమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే
హ్రుదయం లయమైపోయినది
లయలే ప్రియమై జీవితమై

మురిసిన మురళికి మెరసిన మువ్వకి
ఎదలో ప్రేమ పరాగం మది ఆనంద భైరవి రాగం
పిలిచిన మురళి కి వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం

***

చిత్రం : ఆనంద భైరవి
గానం : S P బాలసుబ్రమణ్యం, S జానకి
సంగీతం : రమేష్ నాయుడు
గీత రచన : వేటూరి

Tuesday, September 09, 2008

నిను చూడక నేనుండలేను



నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శ్రుతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

నీ జత గూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హ్రుదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హ్రుదయంగమం
నిను చూడక నేనుండలేను

***

చిత్రం: నీరాజనం
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి
సంగీతం: O P నయ్యర్
గీత రచన: C నారాయణ రెడ్డి

Download

Thursday, September 04, 2008

ఇది తీయని వెన్నెల రేయి



ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలూ
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నడిరాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీ వలపు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు పలికే రాగలు
కలకాలం నిలిచే కావ్యలు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలూ
ప్రేమలేఖలూ
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

***

చిత్రం: ప్రేమలేఖలు (1977)
గానం: S P బాలసుబ్రమణ్యం, P సుశీల
సంగీతం: సత్యం
గీత రచయిత: ఆరుద్ర