Saturday, April 07, 2007

ఏమని నే చెలి పాడుదును

Listen to Manthrigari Viyankudu - telugu Audio Songs at MusicMazaa.com

ఏమని నే చెలి పాడుదును
తికమకలో ఈ మకతికలో
తోటలలో పొదమాటులలో
తెరచాటులలో
ఏమని నే మరి పాడుదును
తికమక లో ఈ మకతికలో

నవ్వు చిరునవ్వు... విరబూసే పొన్నలా...
ఆడు నడయాడు... పొన్నల్లో నెమలిలా...
పరువాలే పార్కుల్లో
ప్రణయాలే పాటల్లో
నీ చూపులే నిట్టూర్పులై
నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీవేణువై
నీ ఊపిరే నా ఆయువై
సాగే తీగ సాగే
రేగిపోయే లేత ఆశల కౌగిట
ఏమని నే మరి పాడుదును
తికమకలో ఈ మకతికలో

చిలక గోరింక... కలబోసే కోరిక...
పలికే వలపంతా... మనదేలే ప్రేమిక...
దడ పుట్టే పాటల్లో
ఈ దాగుడు మూతల్లో
ఏ గొపికో దొరికిందనీ
ఈ రాధికే మరుపాయెనా
నవ్విందిలే బౄందావని
నా తోడుగా ఉన్నావని
ఊగే తనువులూగే
వణకసాగే రాసలీలలు ఆడగ

ఏమని నే మరి పాడుదును
తొలకరిలో తొలి అల్లరిలో
మన అల్లికలో
ఏమని నే చెలి పాడుదును
తికమకలో ఈ మకతికలో

***

చిత్రం - మంత్రి గారి వియ్యంకుడు
సంగీతం - ఇళయరాజా
గానం - బాలు, జానకి
సాహిత్యం - వేటూరి