Thursday, December 06, 2018



సావిత్రి 
జననం  :  6 Dec 1937
మరణం :  26 Dec 1981


ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి (M) జడను చుట్టి (F)
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ (M) చిట్టెమ్మ (F)
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా (M) చెప్పమ్మా (F)

ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా చెప్పమ్మా

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది (F) వయసువుంది (M)
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా (F) కిట్టయ్యా (M)
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య (F) చెప్పయ్య (M)

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య

(Male)
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు
అత్తవరింతినిండా వేసినా
అవి అభిమానమంత విలువచేసున
అభిమానమంత విలువచేసున

ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా చెప్పమ్మా

(Female)
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం
గుణము మంచిదైతే చాలయ
మన గొప్పతనము చెప్పుకోను వీలయ
గొప్పతనము చెప్పుకోను వీలయ

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య

(Male)
కాలు చేయి లోపమని కొక్కేరాయి రూపమని
కాలు చేయి లోపమని కొక్కేరాయి రూపమని
వదినలు నన్ను గేలి చేతురా
పిల్లను తెచ్చి పెళ్లి చేతురా
పిల్లను తెచ్చి పెళ్లి చేతురా

(Female)
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి
నమ్మిన నాపచేనే పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా

అద్దం వంటి మనసువుంది అందమైన వయసువుంది వయసువుంది
ఇంతకన్నా ఉన్దేదేంది కిట్టయ్యా కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్య చెప్పయ్య

ముద్దబంతి పూలు పెట్టి మొగిలిరేకులు జడను చుట్టి
హంసల నడిచి వచ్చే చిట్టెమ్మ
మా ఇంటికి ఏమి తెచ్చవమ్మ చెప్పమ్మా

***

చిత్రం:  కలిసి ఉంటే కలదు సుఖము
గానం: ఘంటసాల , P సుశీల
రచన : కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు 

Wednesday, December 05, 2018

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే





ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాశ ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలక జట్టే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలకా.. చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే
మౌనములోని మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వీలేలేని పంతం వదిలి పలకవటే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునక గాలే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్

ముడిపడిపోయామొక్కటిగా విడివడిపోలేకా
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక
పదునుగా నాటే మన్మధ బాణం నేరం ఏమీ కాదు కదే
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టే అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్

***

చిత్రం: చెలియా
సంగీతం: A R రెహ్మాన్
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: అభయ్ జోద్పూర్కర్ , చిన్మయి


Friday, November 30, 2018

పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!





ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

ఊహలు ఊరేగే గాలంతా 
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ  సమయానికి తగు మాటలు  ఏమిటో  ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా  భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!
   పొరబడిపోకు అంతలా .. నను అడిగావ ముందుగా!
నేనేదో భ్రమలో ఉన్నానేమో.. నీ చిరునవ్వేదో చెబుతోందని !
   అది నిజమే అయినా నాతో అనకు ... నమ్మలేనంతగా!

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !

తగదు సుమా అంటూ ఉంటే ... తలపు దుమారమాగదే  !
  తొలిదశలో అంతా ఇంతే .. కలవరపాటు తేలదే !
ఈ బిడియం గడియే  తెరిచేదెపుడో .. నా మదిలో మాట తెలిపేందుకు!
  నిన్నిదిగో  ఇదదే అనుకోమనకు ఆశలే రేపగా!

ఊహలు ఊరేగే గాలంతా 
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ  సమయానికి తగు మాటలు  ఏమిటో  ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో  అనడం కంటే 
సాగే కబుర్లతో కాలం మరిచి ..  సరదాపడదామంతే !

***

చిత్రం:  సమ్మోహనం 
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం:హరిచరణ్ , కీర్తన 
సంగీతం: వివేక్ సాగర్ 

Sunday, May 13, 2018

కాలం నర్తించదా నీతో జతై .. ప్రాణం సుమించదా నీ కోసమై !!





సదా నన్ను నడిపే.. నీ చెలిమే  పూదారై నిలిచే
ప్రతీ మలుపు ఇకపై.. స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా
ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే !

కాలం నర్తించదా నీతో జతై..
ప్రాణం సుమించదా నీ కోసమై!
కాలం నర్తించదా  నీతో జతై!!

నదికి వరదల్లే
మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో!
తలపు తొలిజల్లై
తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో!
గమనించేలోగా..
గమకించే రాగానా ..
ఎదో వీణ లోన మోగేనా !

కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీ కోసమై
కాలం నర్తించదా  నీతో జతై !!

***

చిత్రం: మహానటి
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చారులత మణి