Tuesday, February 11, 2014

నింగీ నేల ఏకంకాగా... ఈ క్షణమిలాగె ఆగింది...

ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...
ఈ అనుభవం మరలా రానిది...
ఆనంద రాగం మోగింది... అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...

నింగీ నేల ఏకంకాగా... ఈ క్షణమిలాగె ఆగింది
నింగీ నేల ఏకంకాగా... ఈ క్షణమిలాగె ఆగింది
ఒకటే మాటన్నదీ... ఒకటైపొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ... అది నా సొమ్మన్నదీ
పరువాలు మీటి... సెలయేటి తోటి...
పాడాలి నేడు... కావాలి తోడు

ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...

సూర్యుని మాపి... చంద్రుని ఆపి... వెన్నెల రోజంతా కాచింది
సూర్యుని మాపి... చంద్రుని ఆపి... వెన్నెల రోజంతా కాచింది
పగలూ రేయన్నదీ... అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ... నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ... ఎదగాలి బాసై
కలవాలి నీవు... కరగాలి నేను

ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...
ఈ అనుభవం మరలా రానిది...
ఆనంద రాగం మోగింది... అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది... ఏనాడూ నాలో జరగంది...

***

చిత్రం: ప్రేమ
గానం: S P బాలసుబ్రమణ్యం, చిత్ర
రచన: వేటూరి
సంగీతం: ఇళయరాజా