Monday, May 29, 2006

తీగనై మల్లెలు పూచినా వేళ

Listen to Aaradhana - telugu Audio Songs at MusicMazaa.com

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల
మనసు తెర తీచినా మొహమాటమేన
మమత కలబోసినా మాట కరువేన
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల

తెలిసీ తెలియందా
ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా
అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా
అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా
పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా
పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా
పంచుకుంటే మరిచేదా

కలలో మెదిలిందా
ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా
అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా
తప్పు నీదవునా
మారమంటే మారుతుందా
మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా
చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా
చేయి చేయి కలిపేనా

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల
మనసు తెర తీచినా మొహమాటమేన
మమత కలబోసినా మాట కరువేన
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల

***

చిత్రం : ఆరాధన
సంగీతం : ఇళయరాజా
వ్రాసిన వారు : వేటూరి
పాడిన వారు : S P బాలు, S జానకి

***

ఈ పాటని
ఇక్కడ వినండి (చివరి పాట)

Friday, May 19, 2006

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ

Listen to Mutyala Muggu - telugu Audio Songs at MusicMazaa.com

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసిందీ

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండి నావకు చెప్పండి

***

చిత్రం : ముత్యాల ముగ్గు
సంగీతం : K V మహదేవన్
వ్రాసిన వారు : గుంటూరు శేషేంద్ర శర్మ గారు.
పాడిన వారు : P సుశీల

Saturday, May 06, 2006

మౌనమే ప్రియా ధ్యానమై

మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై

చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయి
ఈ దూరం దూర తీరం ముద్దులాడేదెన్నడో

మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ

కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
వచ్చే మాఘమాసం పందిరేసె ముందుగానే
మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో

మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ

***

చిత్రం : చిన్ని కౄష్ణుడు
సంగీతం :
పాడినవారు :
వ్రాసినవారు :