Wednesday, June 21, 2006

ప్రపంచ సంగీత దినోత్సవం

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం . సంగీత ప్రియులందరికీ నా శుభాకాంక్షలు :-)
ఈ దినోత్సవం మొదట యూరోప్ లో మొదలై నెమ్మదిగా ప్రపంచం మొత్తం అల్లుకుంది. 1982(నేను పుట్టిన సంవత్సరం :-) ) నుండి ఈ ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు.

ఈ సందర్భం గా నాకు ఇష్టమైన ఎన్నో రాగాల నుండి ఒక రాగం...

***
Powered by MusicMazaa.com - indian movie portal

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మోగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగీ మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం

నీ పేరోక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఏన్నళ్ళైనా
నీ పేరోక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఏన్నళ్ళైనా
ఉండీ లేకా వున్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం


***

చిత్రం : మంచిమనసులు
వ్రాసినవారు: రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
పాడిన వారు : S P బాలు

Thursday, June 15, 2006

నీ నవ్వు చెప్పింది నాతో...

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని

నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్విలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

***

చిత్రం : అంతం
సంగీతం : R D బర్మన్
వ్రాసిన వారు : సీతారామ శాస్త్రి
పాడిన వారు : S P బాలు