Sunday, July 19, 2009

అలుపన్నది ఉందా ఎగిరే అలకు



Download Song

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల లలలలలలలా
||అలుపన్నది||

నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
ల ల ల ల లలలలలలలా
||అలుపన్నది||

నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల లలలలలలలా
||అలుపన్నది||

***

చిత్రం: గాయం
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

Thursday, June 04, 2009

గోపెమ్మ చేతిలో గోరుముద్ద

S P బాలసుబ్రమణ్యం గారి జన్మదిన సందర్భంగా...

పూర్తి పేరు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం
పుట్టిన తేది: ౪ జూన్, ౧౯౪౬ (4 June, 1946)
పుట్టిన స్థలం: కోనేటమ్మపేట, నెల్లూరు దగ్గర, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి: గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత
మొదటి చిత్రం (గాయకుడిగా): శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (15 Dec, 1966)



గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా ముద్దా కావాలా
ముద్దు కావాలా ముద్దా కావాలా
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద

రాగాలంత రాసలీలలు
అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు
అలు అరు ఇణి
రాధా... రాధా బాధితుణ్ణిలే
ప్రేమారాధకుణ్ణిలే
ఆహాహా
జారు పైట లాగనేలరా
ఆరుబయట అల్లరేలరా
ముద్దు బేరమాడకుండా ముద్దలింక తింటావా
||గోపెమ్మ చేతిలో గోరుముద్ద||

వెలిగించాలి నవ్వు మువ్వలు
అలా అలా అహహ
వినిపించాలి మల్ల గువ్వలు
ఇలా ఇలా ఇలా
కాదా... చూపే లేత శోభనం
మాటే తీపి లాంఛనం
ఆహాహా
వాలు జళ్ళ ఉచ్చులేసినా
కౌగిలింత ఖైదువేసినా
ముద్దు మాత్రమిచ్చుకుంటె ముద్దాయల్లె ఉండనా
||గోపెమ్మ చేతిలో గోరుముద్ద||

***

చిత్రం: ప్రేమించు పెళ్ళాడు
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Tuesday, June 02, 2009

మనసు పలికే మౌన గీతం

ఇళయరాజా గారి జన్మదిన సందర్భంగా...

పూర్తి పేరు: ఇళయరాజా
పుట్టిన తేది: జూన్ ౨, ౧౯౪౩ (June 2, 1943)
పుట్టిన స్థలం: పన్నైపురం, తేని జిల్లా, తమిళ్ నాడు
వృత్తి: సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత



మనసు పలికే మనసు పలికే
మౌనగీతం మౌనగీతం
మనసు పలికే మౌన గీతం నీదే
మమతలొలికే మమతలొలికే
స్వాతిముత్యం స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు
మనసు పలికే మౌన గీతం నీదే
మమతలొలికే స్వాతిముత్యం నీవే

శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ
మరుల జలకాలాడనీ
సగము మేను గిరిజనై పగలు రేయి ఒదగనీ
పగలు రేయి ఒదగనీ
హృదయ మేళనలో మధుర లాలనలో
హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగిపోని రాగ దీపం
వెలిగిపోని రాగ దీపం వేయి జన్మలుగా

మనసు పలికే మౌన గీతం నీదే
మమతలొలికే స్వాతిముత్యం నీవే

కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి
లలిత యామినిలో కలల కౌముదిలో
లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోని కాలమంతా
కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా

మనసు పలికే మనసు పలికే
మౌనగీతం మౌనగీతం
మనసు పలికే మౌన గీతం నీదే
మమతలొలికే మమతలొలికే
స్వాతిముత్యం స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు

***

చిత్రం: స్వాతిముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: C నారాయణ రెడ్డి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Wednesday, May 27, 2009

వీణ వేణువైన సరిగమ విన్నావా



వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఒ ఒ ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహ తహ లాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఒ ఒ ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళ... నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
చూపులు రగిలిన వేళ... ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున జరిగే రాసలీల

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఒ ఒ ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఎదలో అందం ఎదుట... ఎదుటే వలచిన వనితా
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత
కదిలే అందం కవిత... అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఒ ఒ ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహ తహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఒ ఒ ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా

***

చిత్రం: ఇంటింటి రామాయణం
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Wednesday, May 20, 2009

చందమామ రావే జాబిల్లి రావే

సీతారామ శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా...


పూర్తి పేరు: చెంబోలు సీతారామ శాస్త్రి
పుట్టిన తేది: మే ౨౦, ౧౯౫౫ (May 20, 1955)
పుట్టిన స్థలం: అనకాపల్లి, విశాఖ జిల్లా
వృత్తి: గీత రచయిత
మొదటి చిత్రం: సిరివెన్నెల (1988)



చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగిపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కళలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కళలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరి తోటలోని గోగుపూలు తేవే
||చందమామ రావే||

మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదు పద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారి
కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి
జయ జయ కృష్ణా ముకుందా మురారి

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు రావే
చందమామ రావే జాబిల్లి రావే

***

చిత్రం: సిరివెన్నెల (1988)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: సీతారామ శాస్త్రి
గానం: S P బాల సుబ్రహ్మణ్యం, P సుశీల, వసంత

Thursday, April 30, 2009

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

శ్రీ శ్రీ గారి జన్మదిన సందర్భంగా...


పూర్తి పేరు: శ్రీరంగం శ్రీనివాసరావు
పుట్టిన తేది: ఏప్రిల్ 30, 1910
పుట్టిన స్థలం: విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
మరణం: జూన్ 15, 1983
వృత్తి: కవి, గేయ రచయిత




ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా

బడులే లేని పల్లెటూళ్ళలో
బడులే లేని పల్లెటూళ్ళలో
చదువే రాని పిల్లలకు
చదువు రాని చదువుల బడిలో
జీతాలు రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

చాలీ చాలని పూరి గుడిసెలో
చాలీ చాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలి అయిపోయిన పడతులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

కూలి డబ్బుతో లాటరీ టికెట్
లాటరీ టికెట్
కూలి డబ్బుతో లాటరీ టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరిచి
చెడే నిరాశా జీవులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

సేద్యం లేని బీడు నేలలో
సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

***

చిత్రం: భూమి కోసం
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల

Thursday, April 23, 2009

అరె ఏమైందీ

ఎస్ జానకి గారి పుట్టినరోజు సందర్భంగా...

పూర్తి పేరు: ఎస్ జానకి
జన్మదినం: 23 ఏప్రిల్ 1938
పుట్టిన స్థలం: రేపల్లె, గుంటూరు జిల్లా
మొదటి పాట\చిత్రం : విధియిన్ విలయత్తు, తమిళ్ (1957)

***



అరె ఏమైందీ
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ

నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది
పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు వేరు
నింగి వైపు చూపు వేరు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ

ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడూ

అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది

***

చిత్రం: ఆరాధన (1982)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Friday, April 10, 2009

ఎవ్వరో పాడారు భూపాల రాగం



Download Song

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం

ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో గంఠా నాదం
ఇది నా తొలి నైవేద్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై

వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

***

చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: M S విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: S P బాల సుబ్రహ్మణ్యం

Monday, April 06, 2009

ఊగిసలాడకె మనసా



Download Song

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో ఆశగా ఉందనో
ఉర్రూతలూగకే మనసా

తలలోన ముడిచాక విలువైన పూవైన
దైవపూజకు తగదు మనసా (2) ||తలలోన||
పొరపాటు చేసావో దిగాజారిపోతావు
నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు మొదటికే మోసాలు
చాలు నీ వేషాలు మనసా (2)

||ఊగిసలాడకె||

తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను
దిమ్మరిని నమ్మకే మనసా
దేశదిమ్మరిని నమ్మకే మనసా ||తుమ్మెదలు||
చపల చిత్తము విపరీతమవుతుంది
చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు కవ్వింపు సరసాలు
కాలు జారేనేమో మనసా (2)

||ఊగిసలాడకె||

***

చిత్రం: కొత్త నీరు
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర
గానం: P సుశీల

Friday, April 03, 2009

ముందు తెలిసినా ప్రభూ!

జయప్రదగారి జన్మదిన సందర్భంగా...

పేరు: జయప్రద
పుట్టిన తేది: ౩ ఏప్రిల్, ౧౯౬౨ (3 ఏప్రిల్ 1962)
పుట్టిన స్థలం: రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
తోలి చిత్రం: భూమి కోసం (3 నిముషాల పాట, నాట్యం)
వృత్తి: నటి, రాజకీయవేత్త


Download Song

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

***

చిత్రం: మేఘ సందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: P సుశీల

Monday, March 23, 2009

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి


కాంతా రావు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ...

పూర్తి పేరు: తాడేపల్లి లక్ష్మి కాంతా రావు
పుట్టిన తేది: ౧౬ నవంబర్, ౧౯౨౩ (16 నవంబర్, 1923)
సొంత ఊరు: కోదాడ, నల్గొండ జిల్లా
మరణం: ౨౨ మార్చ్, ౨౦౦౯ (22 మార్చ్, 2009)
వ్రుత్తి: నటుడు

***


Download Song


ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి

ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక
ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక
విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
పాట లాగ సాగాలి

***

చిత్రం: ఏకవీర (1969)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: C నారాయణ రెడ్డి
గానం: ఘంటశాల, S P బాలసుబ్రమణ్యం

Thursday, March 19, 2009

అందమైన వెన్నెలలోన


మోహన్ బాబు గారి జన్మదిన సందర్భంగా

పేరు: మోహన్ బాబు
అసలు పేరు: మంచు భక్తవత్సలం నాయుడు
పుట్టిన తేది: మార్చ్ ౧౯, ౧౯౫౨ (march 19, 1952)
పుట్టిన స్థలం: మోదుగులపాలెం, చిత్తూరు జిల్లా
వృత్తి: నటుడు, విద్యావేత్త



Download

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
మనసు నిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలే ఊగాల శివరంజి నవ్వాల
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
ముద్దబంతి ముగ్గులోకి సాగిరార మగసిరిలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
ముద్దబంతి ముగ్గులోకి సాగిరార మగసిరిలా

నురుగు తరగల గోదారి వలపు మిల మిల మెరవాలా
ఒంపుసొంపుల సెలఏరై వయసు గల గల నవ్వాలా ||నురుగు||
కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాలా
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
కంటి పాపనై కాలి అందెనై (2)
కాలమంతా కరగబోసి కాపు ఉండనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా

ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ||ఇంద్రధనుసు||
ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
తోడూ నీడ ఇరువురమై గూటికందం తేవాలా
తీగమల్లెనై తేనేజల్లునై (2)
కోరికంత కూడబెట్టి కొలువు సేయనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

***
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం:
గానం: K J ఏసుదాస్, చిత్ర

Tuesday, March 17, 2009

ఏ జన్మదో ఈ సంబంధము




Download

ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమో ఈ సంగీతము
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో

ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో

ఏ జన్మదో ఈ సంబంధము

లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ
కళలు పండి వెలుగులాయే కలిసి ఉందామనీ
వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికి కవ్వింతలాయే కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో

ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమో ఈ సంగీతము
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధము

***

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: M M కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: M M కీరవాణి, చిత్ర

Thursday, March 12, 2009

సడి సేయకో గాలి సడి సేయబోకే




సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడి సేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే
సడి సేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడి సేయకే

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన బూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి

***

చిత్రం: రాజ మకుటం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: P లీల

Monday, March 09, 2009

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా




చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా ||చుట్టూ పక్కల||
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం ||సాధించదు||
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే ||కరుణను||

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే ||ఋణం||

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

***

చిత్రం: రుద్రవీణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: S P బాలసుబ్రమణ్యం

Friday, March 06, 2009

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది




ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

***

చిత్రం: సప్తపది (1981)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Friday, February 20, 2009

సింగారాల పైరుల్లోనా (నిర్మలమ్మ డాన్స్)


పేరు: నిర్మలమ్మ
పుట్టిన తేది: 1927
పుట్టిన స్థలం: బందరు
మరణం: 19th Feb, 2009
వృత్తి: నటి (1950 - 2002)
మొదటి చిత్రం: గరుడ గర్వభంగం (1950)
చివరి చిత్రం: ప్రేమకు స్వాగతం (2002)

Wednesday, February 04, 2009

ఆకాశమా నీవెక్కడ...

రాజశేఖర్ గారి జన్మదిన సందర్భంగా...


పూర్తి పేరు: డాక్టర్ రాజశేఖర్
పుట్టిన తేది: ఫిబ్రవరి ౪, ౧౯౬౨ (February 4, 1962)
పుట్టిన స్థలం: తమిళ నాడు
వృత్తి: నటుడు

ఆకాశమా నీవెక్కడ
అవనిపైనున్న నేనెక్కడ
ఏ రెక్కలతో ఎగిసి వచ్చిన
నిలువగలనా నీ పక్కన ||ఏ రెక్కలతో||
ఆకాశమా నీవెక్కడ
అవనిపైనున్న నేనెక్కడ

నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా ||నీలాల||
ముళ్ళున్న రాళ్లున్న నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెల
నీ మనసన్నది నా మది విన్నది
నిలిచిపోయింది ఒక ప్రశ్నలా
నిలిచిపోయింది ఒక ప్రశ్నలా

ఆకాశమా లేదక్కడ
ఆకాశమా లేదక్కడ
అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
వేల తారకలు తనలో ఉన్నా
నేలపైనే తన మక్కువ ||ఆకాశమా||

వెల లేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని చిరు వెలుగునై ||వెల లేని||
వెను తిరిగి చూడని నీ నడకలో
నను కడ దాక రాని నీ అడుగునై
మన సహ జీవనం వెలిగించాలిలే
సమతా కాంతులు ప్రతి దిక్కున
సమతా కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ
అది నిలిచి ఉంది నా పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
నేలపైనే తన మక్కువ
ఈ నీల పైనే తన మక్కువ

***

చిత్రం: వందేమాతరం
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: C నారాయణ రెడ్డి
గానం: S జానకి, S P బాలసుబ్రమణ్యం

Monday, February 02, 2009

ప్రియతమా... ప్రియతమా...

A M రత్నం గారి జన్మదిన సందర్భంగా...

పూర్తి పేరు: అలహరి M రత్నం
పుట్టిన తేది: ఫిబ్రవరి ౨ (February 2)
పుట్టిన స్థలం: నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి: నిర్మాత, దర్శకుడు



ప్రియతమా ప్రియతమా తరగని పరువమా
తరలిరా తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేరరావే
ప్రియతమా ప్రియతమా తరగని విరహమా
కదలిరా కదలిరా
మాఘమాసానివై మల్లె పూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా ||ప్రియతమా||

నీ ఆశలన్నీ నా శ్వాసలైన
ఎంత మోహమో
నీ ఊసులన్ని నా బాసలైన
ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా
సుడిగాలినైనా ఒడి చేరనా
నీడల్లే నీ వెంట నేనుంటా
నా ప్రేమ సామ్రాజ్యమా ||ప్రియతమా||

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే
తీయ తీయగా
కౌగిట్లో పడితే పుడుతుంది వానా
కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసేయనా
ఏకాంత సేవ చేసేయనా
వెచ్చంగా చలి కాచుకోవల
నీ గుండె లోగిళ్ళలో ||ప్రియతమా||

***

చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్ కోటి
సాహిత్యం: భువనచంద్ర, వడేపల్లి కృష్ణ
గానం: S P బాలసుబ్రమణ్యం, చిత్ర

Thursday, January 29, 2009

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే


వేటూరి గారి జన్మదిన సందర్భంగా...



పూర్తి పేరు: వేటూరి సుందరరామ మూర్తి
పుట్టిన తేది: జనవరి ౨౯, ౧౯౩౬ (January 29, 1936)
పుట్టిన స్థలం: తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి: గీత రచయిత

మాతృదేవోభవ చిత్రం లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకి వేటూరి గారికి నేషనల్ అవార్డు వచ్చింది, కాని తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించలేదన్న కారణంగా ఆయన ఆ అవార్డుని తిరస్కరించారు.


రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమేన్నాడో చేకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మ
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం ||రాలిపోయే||

చెదిరింది నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై
ఆశలకే హారతివై ||రాలిపోయే||

అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశం నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వేణియవై ||రాలిపోయే||

***

చిత్రం: మాతృదేవోభవ
సంగీతం: M M కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: M M కీరవాణి

Monday, January 19, 2009

ఎదురీతకు అంతం లేదా



Download the song here

ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా

సాగరమే నా చేరువనున్న దాహం తీరదులే
తీరాలేవో చేరుతు ఉన్నా దూరం మారదులే
ఇది నడి ఏట తీరాల వేట
ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా

చేయని నీరం చెలిమిని కూడా మాయం చేసేనా
మాసిన మదిలో మమతను కూడా గాయం చేసేనా
నాయను వారే పగవారైతే
ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా

***

చిత్రం: ఎదురీత
సంగీతం: సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: S P బాల సుబ్రహ్మణ్యం

Friday, January 02, 2009

కోనలో సన్నజాజి మల్లి జాజిమల్లి



కోనలో సన్నజాజి మల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హోయ్ శ్రీకారమై హోయ్
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్నజాజి మల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో ప్రేమ కవితలల్లి కవితలల్లి
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగరంజితాలు
సరసములో సమరములు
సరసులకు సహజములు
ప్రాభవాలలోన నవ శోభనాల జాణ
రాగదే రాగమై రాధవై

కోరుకో సన్నజాజి మల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సొకులన్ని సొకులన్ని
పాడుకో ప్రెమ కవితలల్లి కవితలల్లి
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
రాగలనే హోయ్ బోయీలతో హోయ్
మేఘాల మేనాలో రానా
||కోనలో||

కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు
మధురిమకై మధనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగా చేరగా
||కోనలో||

***

చిత్రం: మహర్షి
గానం: S P బాల సుబ్రమణ్యం, S జానకి
సంగీతం: ఇళయరాజా
రచన: --