Friday, January 27, 2006

ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే...

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే


చిత్రం : గుప్పెడు మనసు
వ్రాసిన వారు : ఆచార్య ఆత్రేయ
సంగీతం : M S విశ్వనాథన్