Wednesday, November 30, 2005

Wednesday, November 09, 2005

ఏ శ్వాస లో చేరితే...

మొన్న దసరాకి ఇచ్చిన నంది అవార్డ్స్ లో నేనున్నాను చిత్రంలో చంద్రబోస్ గారు వ్రాసిన టైటిల్ సాంగ్ కి అవార్డ్ వచ్చింధి. అదే సినిమాలో నాకు నచ్చిన మరొక ఆణిముత్యం ఉంది... "ఏ శ్వాశలో చేరితే...". అద్భుతమైన పదజాలం. నాకు బాగా నచ్చిన సిరివెన్నెలగారి పాటలలో ఇది ఒకటి.నాకు మొదటి నుంచి కౄష్ణుడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకేనేమో ఈ పాట అంతగా నచ్చింది.

జీవితం లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ని చేరుకుని సంతోషం గా ఉంది అని చెప్పటానికి... ఎన్నో గాయాలు తగిలిన వేణువు కౄష్ణుని సన్నిధి చేరుకోగానే మోక్షం పొందింది అని చెప్పారు. ఎంత అద్భుతమైన ఉపమానం.

"మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కౄష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవా నీ సన్నిధి"

ఎంత అద్భుతంగా వర్ణించారు. ఏం పుణ్యం చేసుకుందో కౄష్ణున్ని చేరుకోగానే అష్ఠాక్షరిగా మారింధి. అష్ఠాక్షరి అంటే "ఓం నమో నారాయణాయ". అష్ఠాక్షరిగా మారటం అంటే మోక్ష స్థితికి చేరుకుందన్నమాట. ఎంత చక్కని వర్ణన.

సిరివెన్నెలగారు... మీకు మీరే సాటి అని మరో సారి నిరూపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్.

***

Listen to Nenunnanu - telugu Audio Songs at MusicMazaa.com

చిత్రం: నేనున్నాను

వ్రాసిన వారు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సంగీతం: కీరవాణి

పాడిన వారు: చిత్ర

వేణుమాధవా ఆ ..ఆ... వేణు మాధవా.....ఆ ..ఆ..

ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌ
నమై నిను చేరని మాధవా.. ఆ.. ఆ..
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
కౄష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది
వేణు మాధవా నీ సన్నిధి
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులుసడి వినబడక హౄదయానికి
అలజడితో అణువణువు తడబడదా
ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..
నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది నివేదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి
గ గ రి గ రి స రి గ గ రి రి స రి గ ప ద సా స ద ప గ రి స రి గ ప ద ప ద గ >ప ద స ద ద ప గ రి గా గ ప ద స స గ ప ద స స ద ప ద రి రి ద ప ద రి రి ద స రి గ రి స రి గ రి స రి గ రి గ రి స రి గా రి స ద ప గ గ గ పా పా ద ప ద ద ద గ స ద స స గ ప ద స రి స రి స రి స ద స రి గ ద స ప గ రి ప ద ప ద స రి స రి గ ప ద రి స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ స రి గ ప ద రి గా
రాధికా హౄదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

P.S. ఈ పాట ఏ రాగం లో ఉందో తెలీదు. తెలిపిన వారికి కౄతఘ్నతలు.

Monday, November 07, 2005