Monday, March 23, 2009

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి


కాంతా రావు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ...

పూర్తి పేరు: తాడేపల్లి లక్ష్మి కాంతా రావు
పుట్టిన తేది: ౧౬ నవంబర్, ౧౯౨౩ (16 నవంబర్, 1923)
సొంత ఊరు: కోదాడ, నల్గొండ జిల్లా
మరణం: ౨౨ మార్చ్, ౨౦౦౯ (22 మార్చ్, 2009)
వ్రుత్తి: నటుడు

***


Download Song


ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి

ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక
ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక
విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
పాట లాగ సాగాలి

***

చిత్రం: ఏకవీర (1969)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: C నారాయణ రెడ్డి
గానం: ఘంటశాల, S P బాలసుబ్రమణ్యం

Thursday, March 19, 2009

అందమైన వెన్నెలలోన


మోహన్ బాబు గారి జన్మదిన సందర్భంగా

పేరు: మోహన్ బాబు
అసలు పేరు: మంచు భక్తవత్సలం నాయుడు
పుట్టిన తేది: మార్చ్ ౧౯, ౧౯౫౨ (march 19, 1952)
పుట్టిన స్థలం: మోదుగులపాలెం, చిత్తూరు జిల్లా
వృత్తి: నటుడు, విద్యావేత్త



Download

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
మనసు నిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలే ఊగాల శివరంజి నవ్వాల
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
ముద్దబంతి ముగ్గులోకి సాగిరార మగసిరిలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
ముద్దబంతి ముగ్గులోకి సాగిరార మగసిరిలా

నురుగు తరగల గోదారి వలపు మిల మిల మెరవాలా
ఒంపుసొంపుల సెలఏరై వయసు గల గల నవ్వాలా ||నురుగు||
కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాలా
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
కంటి పాపనై కాలి అందెనై (2)
కాలమంతా కరగబోసి కాపు ఉండనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా

ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ||ఇంద్రధనుసు||
ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
తోడూ నీడ ఇరువురమై గూటికందం తేవాలా
తీగమల్లెనై తేనేజల్లునై (2)
కోరికంత కూడబెట్టి కొలువు సేయనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

***
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం:
గానం: K J ఏసుదాస్, చిత్ర

Tuesday, March 17, 2009

ఏ జన్మదో ఈ సంబంధము




Download

ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమో ఈ సంగీతము
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో

ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో

ఏ జన్మదో ఈ సంబంధము

లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ
కళలు పండి వెలుగులాయే కలిసి ఉందామనీ
వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికి కవ్వింతలాయే కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో

ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమో ఈ సంగీతము
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధము

***

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: M M కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: M M కీరవాణి, చిత్ర

Thursday, March 12, 2009

సడి సేయకో గాలి సడి సేయబోకే




సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడి సేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే
సడి సేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడి సేయకే

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన బూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి

***

చిత్రం: రాజ మకుటం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: P లీల

Monday, March 09, 2009

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా




చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా ||చుట్టూ పక్కల||
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం ||సాధించదు||
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే ||కరుణను||

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే ||ఋణం||

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

***

చిత్రం: రుద్రవీణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: S P బాలసుబ్రమణ్యం

Friday, March 06, 2009

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది




ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

***

చిత్రం: సప్తపది (1981)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి