Wednesday, January 20, 2010

విన్నవించు నా చెలికి మేఘ సందేశం...




***



ఆకాశ దేశానా... ఆషాడ మాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘ సందేశం... మేఘ సందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమి వోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన... నా విరహ వేదన

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపులా లేఖలతో
రుధిర భాష్ప జలధారలతో
ఆ.....
విన్నవించు నా చెలికి మనో వేదన... నా మరణ యాతన

***

చిత్రం: మేఘ సందేశం (1984)
సంగీతం: రమేష్ నాయుడు
రచన: వేటూరి
గానం: K J ఏసుదాస్