Friday, April 25, 2008

యాతమేసి తోడినా ఏరు ఎండదు

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఎడ్సినా పొంత నిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు

***

చిత్రం: ప్రాణం ఖరీదు
రచన: జాలాది రాజా రావు
సంగీతం: చక్రవర్తి
గానం: --

5 comments:

kiraN said...

అద్భుతమైన భావం

Unknown said...

Chaitanya,

Chala rojuluki oka manchi update :)
Keep posting updates yaar.

Gangadhar

సుజ్జి said...

hello chaitu garu.. ee pata, sakshi cinema lo di anukunta.. krishna garu hero . i wish u to check it once.

సుజ్జి said...

yeh chaitu. u r right. sorry for troubling u all after my mistake. any way, nice knowing u.

Sky said...

చైతన్య గారు,
అక్షర లక్షలు విలువ చేసే మాటలను తేట తెలుగు పదాలలో కూర్చగల తెలుగు కవులలో జాలాది గారు ఒకరు. మంచి సాహిత్యాన్నీ గుర్తుకుతెచ్చినందుకు ధన్యవాదములు.

It has become a day to day activity for me to view your blog these days as I could find most of my favorite songs here.

please continue posting all the wonderful songs. If possible please upload the songs too.

Wishing you all the very best and hope to see great works here.

Thanks,

సతీష్ యనమండ్ర