Saturday, June 04, 2016

ఏ నాడు విడిపోని ముడి వేసేనే





జూన్ 4th
S P బాలసుబ్రమణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా ..

ఏ నాడు విడిపోని ముడి వేసేనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు 
ఈ సుధల ఆమనిని
ఏ నాడు విడిపోని ముడి వేసేనే ఏ నాడు విడిపోని ముడి వేసేనే

మొహాన పారాడు వేలి కొనలు
నీ మేను  కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయమూ
కలకాలమూ కలగానమై నిలవాలి మన కోసము
ఈ మమత
ఏ నాడు విడిపోని ముడి వేసేనే
ఏ నాడు విడిపోని ముడి వేసేనే

నీ మోవి మౌనాన మదనరాగం
మొహాన సాగే మదుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు వీసె వేణు నాదం
పాపలుగా వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే చేరింది మన జంటకు
ముచ్చటగా

***

చిత్రం: శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్
సంగీతం: ఇళయరాజా
గానం: S P బాలసుబ్రమణ్యం , జానకి