Thursday, June 21, 2007

ప్రపంచ సంగీత దినోత్సవం

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం . సంగీత ప్రియులందరికీ నా శుభాకాంక్షలు :-)

ఈ సందర్భం గా ఒక రాగం...

***

Listen to Aalaapana - telugu Audio Songs at MusicMazaa.com

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాల

ఆవేశమంతా

నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం
నిదురలేచె నాలో హౄదయమే

ఆవేశమంతా

సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగసగమగమ నిసనిస గమగపదనిస
జలకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలిపించం
ఎదలు కలిపి నాలో విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా

ఆవేశమంతా

***

చిత్రం : ఆలాపన (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి (అనుకుంటున్నాను)
గానం : బాలు

3 comments:

kiraN said...

మీకు కూడా సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ పాట నేనెప్పుడూ వినలేదు..
వినిపించినందుకు ధన్యవాదాలు
-కిరణ్

Anonymous said...

wish you the same and thanks for reminding this gem!

Lyricist is Veturi indeed :)

Sujit said...

its amazing..!