Wednesday, September 24, 2008

అలివేణీ ఆణిముత్యమా...



అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమా
ఆవిరి చిగురో... ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో... జాలినవ్వు జాజిదండలో

అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రాణముత్యమా
జాబిలి చలువో... ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో... జాజిమల్లి పూలగుండెలో

అలివేణీ ఆణిముత్యమా...

కుదురైన బొమ్మకి... కులుకు మల్లెరెమ్మకి
కుదురైన బొమ్మకి... కులుకు మల్లెరెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా... బొట్టుగా
వద్దంటే ఒట్టుగా!

అందాల అమ్మకి... కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి... కుందనాల కొమ్మకి
అడుగుమడుగులొత్తనా... మెత్తగా
అవునంటే తప్పుగా!

అలివేణీ ఆణిముత్యమా... నా పరువాల ప్రాణముత్యమా

పొగడలేని ప్రేమకి... పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి... పొన్నచెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా... పూజగా
పులకింతల పూజగా!

తొలిజన్మల నోముకి... దొరనవ్వుల సామికి
తొలిజన్మల నోముకి... దొరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా... చల్లగా
మరుమల్లెలు చల్లగా!

అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమా
జాబిలి చలువో... ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో... జాజిమల్లి పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...
అలివేణీ ఆణిముత్యమా...

***

చిత్రం : ముద్దమందారం
సంగీతం : రమేష్ నాయుడు
గానం : S P బాలసుబ్రమణ్యం, S జానకి
గీత రచన : వేటూరి