
పేరు: జయప్రద
పుట్టిన తేది: ౩ ఏప్రిల్, ౧౯౬౨ (3 ఏప్రిల్ 1962)
పుట్టిన స్థలం: రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
తోలి చిత్రం: భూమి కోసం (3 నిముషాల పాట, నాట్యం)
వృత్తి: నటి, రాజకీయవేత్త
Download Song
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
***
చిత్రం: మేఘ సందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: P సుశీల