ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి .. సరదాపడదామంతే !
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
పరవశమా మరీ ఇలా... పరిచయమంత లేదుగా!
పొరబడిపోకు అంతలా .. నను అడిగావ ముందుగా!
నేనేదో భ్రమలో ఉన్నానేమో.. నీ చిరునవ్వేదో చెబుతోందని !
అది నిజమే అయినా నాతో అనకు ... నమ్మలేనంతగా!
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
తగదు సుమా అంటూ ఉంటే ... తలపు దుమారమాగదే !
తొలిదశలో అంతా ఇంతే .. కలవరపాటు తేలదే !
ఈ బిడియం గడియే తెరిచేదెపుడో .. నా మదిలో మాట తెలిపేందుకు!
నిన్నిదిగో ఇదదే అనుకోమనకు ఆశలే రేపగా!
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా !
ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవ్వరినడగాలటా !
చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి .. సరదాపడదామంతే !
చాలా పద్ధతిగా భావం తెలిసి.. ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి .. సరదాపడదామంతే !
***
చిత్రం: సమ్మోహనం
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం:హరిచరణ్ , కీర్తన
సంగీతం: వివేక్ సాగర్
No comments:
Post a Comment