సదా నన్ను నడిపే.. నీ చెలిమే పూదారై నిలిచే
ప్రతీ మలుపు ఇకపై.. స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా
ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే !
కాలం నర్తించదా నీతో జతై..
ప్రాణం సుమించదా నీ కోసమై!
కాలం నర్తించదా నీతో జతై!!
నదికి వరదల్లే
మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో!
తలపు తొలిజల్లై
తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో!
గమనించేలోగా..
గమకించే రాగానా ..
ఎదో వీణ లోన మోగేనా !
కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీ కోసమై
కాలం నర్తించదా నీతో జతై !!
***
చిత్రం: మహానటి
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చారులత మణి
No comments:
Post a Comment