ఎవరైనా చూసారా...
ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
గారంగా కొసరే వేళ ... కారంగా కసిరే వేలా
గుండెల్లో జరిగే గోలా... మౌనంగా ఉంటే మేలా...
ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
అప్పుడప్పుడీ ఉపవాసం ...తమ అలవాటా ...
కోరుకుంటె నా సహవాసం... ఏం పొరపాటా ...
ఒహో ఏమా రోషం ... వామ్మో సమరావేసం
కొరికేసే ఉక్రోషం...
కరిగించే సరసం కోసం ... అడిగేస్తే ఏమిటి దోషం
ఇష్టమంత ఉగ్గబట్టి ఎందుకంత మొగమాటం
ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా
లేనిపోని సైగలు చేసి నను లాగాలా..
చేరగానే వెనకడుగేసి వెటకారాలా
లోలో సరదా లేదా... పై పై పరదాలేలా
తగువేలా నాతో తగువేలా
బిగువేలా ఇంకా బిడియాలా
గుట్టే దాచాలన్నా దాగేనా
ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
ఎర వేసే అల్లరి ఈల... పొరపాటే అయిపోవాలా
దరి దాటే వరదయ్యేలా... పరుగెడితే పడవా బాల
ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా
***
చిత్రం: ఇష్టం
గానం: హరిహరన్, చిత్ర
సంగీతం : గోపీనాథ్
సాహిత్యం: ??
No comments:
Post a Comment