
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరు నవ్వు సొగసులో
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
***
చిత్రం: అమెరికా అమ్మాయి
సంగీతం: GK వెంకటేష్
గానం: G ఆనంద్
రచన: మైలవరపు గోపి
4 comments:
నాకు బాగా నచ్చిన పాట . సాహిత్యం :మైలవరపు గోపి
జెవరాలు కాదు జవరాలు
సింగార కాదు - శృంగార
అని అనుకుంటా
Anonyous.. gaaru cheppinadi sariayinadi.
Plz.. Go to This link..
http://vanajavanamali.blogspot.in/2010/12/naakistamaina-paata.html
@వనజవనమాలి
సాహిత్యం ఎవరో తెలియజేసినందుకు థాంక్స్..!!
@Anonymous
జవరాలు కరెక్ట్ చేసాను...
కానీ ఎన్ని సార్లు విన్నా నాకు 'సింగార దీపిక' అనే వినిపిస్తుంది!
Post a Comment