Tuesday, October 09, 2012

పరువమా చిలిపి పరుగు తీయకు

పరువమా చిలిపి పరుగు తీయకు..
పరువమా చిలిపి పరుగు తీయకు..
పరుగులో పంతాలు పోవకు..
పరుగులో పంతాలు పోవకు..
పరువమా చిలిపి పరుగు తీయకు..

ఏ ప్రేమ కోసమో చూసే చూపులు..
ఏ కౌగిలింతకో చాచే చేతులు..
తీగలై హొ చిరు పూవులై పూయ..
గాలిలో హొ రాగాలుగా మ్రోగ..
నీ గుండె వేగాలు తాళం వేయ..

పరువమా చిలిపి పరుగు తీయకు..

ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో..
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో..
వెతికితే హొ నీ మనసులో లేదా..
దొరికితే హ జత కలుపుకోరాదా..
అందాక అందాన్ని ఆపేదెవరు..

పరువమా చిలిపి పరుగు తీయకు..




***

చిత్రం: మౌన గీతం
సంగీతం: ఇళయరాజా
రచన: ఆత్రేయ
గానం: S P బాలసుబ్రహ్మణ్యం, S జానకి

2 comments:

రాజ్ కుమార్ said...

మంచి పాటని పరిచయం చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. థాంక్యూ సో మచ్ అండీ.

Anonymous said...

Nice song... keep posting Chaitu!
- Gangadhar