Tuesday, March 17, 2009

ఏ జన్మదో ఈ సంబంధము




Download

ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమో ఈ సంగీతము
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో

ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో

ఏ జన్మదో ఈ సంబంధము

లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ
కళలు పండి వెలుగులాయే కలిసి ఉందామనీ
వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికి కవ్వింతలాయే కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో

ఏ జన్మదో ఈ సంబంధము
ఏ రాగమో ఈ సంగీతము
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధము

***

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: M M కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: M M కీరవాణి, చిత్ర

1 comment:

kiraN said...

మంచి మెలోడియస్ సాంగ్. పోస్ట్ చేసి గుర్తు చేసినందుకు థాంక్స్.
కీరవాణి పాడిన మొదటి పాటా ఇది??


- కిరణ్
ఐతే OK