Friday, March 06, 2009

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది




ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

***

చిత్రం: సప్తపది (1981)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

2 comments:

Sky said...

నమస్కారం చైతన్య గారు,

చాలా కాలం తర్వాత మీ బ్లాగ్ ని ఈ రోజు చూశాను..... మళ్ళీ కామెంట్ పెట్టాలి అనిపించి రాస్తున్నాను. విశ్వనాధ్ గారి సినిమాలకి విశ్వనాధ్ గారికి నేను అభిమానిని (ఎవరు కాదు చెప్పండి?) మా గురువుగారి ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే.... మమ మహదేవన్, వేటూరి, విశ్వనాధ్ గారు కలిస్తే అదో త్రివే(వా)ణీ సంగమం.....

"ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది"-- వేటూరివారు తప్ప ఎవరు రాయగలరు?

"ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు" ---
అంత మంచి సాహిత్యం, సంగీతం ఉన్న పాటకి బాలు గారు వారి గళంతో చందన పరిమళాన్ని అద్దారు.... saptapadi is considered to be one of the classics of Telugu movies. అంత మంచి పాటను మరో సారి గుర్తుకు తెచ్చినందుకు థాంక్స్ అండి..... మరో శుభవార్త--- త్వరలో మరోసారి బాలు గారినీ, వేటూరి గారినీ, విశ్వనాధ్ గారిని కలవబోతున్నాను......

ప్రతీ సారీ చెప్పేదే మరో మారు చెప్తున్నాను(మీరు విసుక్కున్నా సరే)-- వీలయినన్ని ఎక్కువ పాటలను పెట్టండి ప్లీజ్.... నాకు ఏదయినా మొదటిసారి అడగటం అలవాటు కుదరకపోతే రెండో సారి అడుక్కోవటం అలవాటు :)---- ఇక విషయం గ్రహించి నాలాంటి సంగీత సాహిత్యాభిమానుల కోరిక తీరుస్తారని ఆశిస్తూ


భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర
sky.globalassociates@gmail.com

చైతన్య said...

ధన్యవాదాలు సతీష్ గారు... తప్పకుండ బ్లాగ్ ని రెగ్యులర్ గా update చేస్తాను.