Download Song
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో గంఠా నాదం
ఇది నా తొలి నైవేద్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం
***
చిత్రం: కోకిలమ్మ (1983)
సంగీతం: M S విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: S P బాల సుబ్రహ్మణ్యం
4 comments:
చాలా బాగుంది.
- కిరణ్
ఐతే OK
hi,
Songs baaga update chestunnaru..idhi rendo saari mee blog ki raavadam..
Mee daggara good collection undi..
All the best.
Siva Cheruvu
@kiraN
థాంక్స్!
@శివ చెరువు
థాంక్స్!
Keep visiting
చైతన్యగారూ..మీ బ్లాగ్ చాలా బాగుందండీ. మీ సాంగ్స్ కలెక్షన్ చాలా బాగుంది. నేనూ ఇదే పాట మీద ఒక చిన్న టపా రాశానండీ. వీలుంటే ఒకసారి స్నిగ్ధకౌముది చూడండి.
Post a Comment