Thursday, March 20, 2008

మనసున మల్లెల మాలలూగెనె



మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనొ
కొమ్మల గువ్వలు గుస గుస మనిన
రెమ్మల గాలులు ఉసురుసురనిన
అలలు కొలనులో గల గల మనిన
అలలు కొలనులో గల గల మనిన
దవ్వుల వెనువు సవ్వడి వినిన
దవ్వుల వెనువు సవ్వడి వినిన
నువ్వు వచ్చేవని నీ పిలుపే విని
నువ్వు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ ఐన ఇక విడిచిపోకుమా
ఘడియ ఐన ఇక విడిచిపోకుమా
ఎగసిన హ్రుదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

***
చిత్రం : మల్లీశ్వరి
గీతం : దేవులపల్లి క్రిష్ణశాస్త్రి
గానం : భానుమతి రామక్రిష్ణ
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు

5 comments:

kiraN said...

మనసుకు మత్తెక్కించే మంచి పాట.
పనిలోపనిగా ఆ పాట వినడానికి చిరునామా కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

కిరణ్
ఐతేOK [www.aithesare.blogspot.com]

చైతన్య said...

kiraN... ee paaTanu meeru ikkaDa vinavachchu...

http://www.oldtelugusongs.com/newsongs/vintage/Malliswari_1951-PBhanumati-ManasunaMallelaMalalugene-Devulapalli_SRajeswaraRao.mp3

Sujit said...

nice one :)

Srinivas Kotra said...

hello chaitanya garu, hope u remember me This is srinivas from vizag. there r some spelling mistakes in this song, plz take care

Srinivas Kotra said...

U r choice is good.
venu madhava song mohana ragam lo undani cheppeandi nene.