Monday, February 05, 2007

చిన్నమాట... ఒక చిన్నమాట

చిన్నమాట... ఒక చిన్నమాట
చిన్నమాట... ఒక చిన్నమాట (2)
సందెగాలి వీచి సన్నజాజి పూచి
జలదరించే చల్లనివేళ చిన్నమాట


రాక రాక నీవు రాగ వలపు ఏరువాక
నావెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
నువ్వు వస్తే నవ్వులిస్తా
పువ్వులిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు
మాట మాట #చిన్నమాట #


కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ వాలుచూపే నీలాల మెరుపై విరితేనెలే వెల్లువాయె
అందమంతా ఆరబొసి
మల్లెపూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు
మాట మాట #చిన్నమాట #

*****

చిత్రం - మల్లెపూవు
సంగీతం - చక్రవర్తి
సాహిత్యం - ఆరుద్ర (అని ఊహిస్తున్నాను, ఖచ్చితంగా తెలీదు)
గానం - P సుశీల

4 comments:

kiraN said...

చిన్న మాట చెప్పనా..
ఈ పాట చాల బాగుంది..
పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు

- కిరణ్

Anonymous said...

Nice one!
This link adds to the confusion about the lyricist though ;)
http://www.ghantasala.info/tfs/cdatac2b0.html

Thanks for the update :)

Unknown said...

chaalaa rOjula taruvaata mI blog chUstunnanu. Beautiful song ! Mallepuvvu lO songs annI baagunTaayi.

sande gaali vIchi?
nEnu sande gaali vIchE anukunTunnaanu ippaTivaraku.

- V

సుజ్జి said...

Wow..!! i really love this song tooo.....much.. thankyou.