Friday, February 16, 2007

ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

Listen to Idhi Katha Kaadu - telugu Audio Songs at MusicMazaa.com

జూనియర్ జూనియర్ జూనియర్
yes boss
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా? నేనా? హి హి హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హౄదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు

జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా హి హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహము వేస్తే తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం

No it's bad
But i am mad
మోడు కూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం

హ హ హ హ
What పక పక పిక పిక

చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
Boss, love has no season, not even reason
Shutup
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఎండా వాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి

It is highly idiotic
No boss, it is fully romantic
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా


***

చిత్రం: ఇది కథ కాదు
గానం: బాలసుబ్రమణ్యం, రమోల, సదన్
సంగీతం: విశ్వనాధన్
గీతం: ఆత్రేయ

3 comments:

kiraN said...

manchi paaTa :)

- kiraN

Anonymous said...

naaku ee movie chala ishtam.
thanks for the reminder....

Sky said...

నమస్కారం చైతన్య గారు,
మీ అభినందనలకి నా ధన్యవాదములు. ఈ పూట ఆదివారం కావటం చేత కొంత విరామం దొరకటం తో మీ బ్లాగ్ మొత్తాన్నీ చూసాను. మీ ఉత్తమ సంగీత అభిరుచికి నా అభినందనలు. పాటల సేకరణ చాలా అద్భుతం గా వుంది. ప్రతీ పాటకి ఒక వ్యాఖ్య రాయాలి అన్నరీతిలో నాకిష్టమైన ఎన్నో పాటలను మీ బ్లాగ్ లో చూసాను.

ఇంకా ఎన్నో మంచి మంచి గీతాలను మీ బ్లాగ్ ద్వారా సంగీతాభిమానులకు అందించండి. ఇక మీదట ఇటువైపు తరచూ వస్తుంటాను. తప్పకుండా ఆ పాత మధుర గీతాలను అందిస్తారు అని ఆశీస్తూ.......

భవదీయుడు

సతీష్ యనమండ్ర