Thursday, December 21, 2006

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

Listen to Sitara - telugu Audio Songs at MusicMazaa.com

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
మిలిమిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిలిమిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతలు దాచకు
ఏమైనా ఓ మైనా

అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగ కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే వెన్నలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసుల దేమైన మైనా
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికె చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కున దాగిన నేనేలే ఆ మైనా

***

చిత్రం - సితార
సంగీతం - ఇళయరాజా
సాహిత్యం - వేటూరి
గానం - S P బాలు, S జానకి

6 comments:

Anonymous said...

bhale..
ee paatante naku chala ishtam.

paatalu chupinchi chaala rojulaindi, endukani

Anonymous said...

bhale..
ee paatante naku chala ishtam.

paatalu chupinchi chaala rojulaindi, endukani??

Anonymous said...

Update after a long time... Good One! Suits the mood ... :)

రాధిక said...

plz update.

Anonymous said...

ఎన్నాళ్లకెన్నాళ్లకు!! తప్పులు లేకుండా మంచి పాటల సాహిత్యాన్ని బ్లాకృతం చేసే కొద్దిమందిలో మీరొకరు. "చిరునామా" అని రాయాలనుకొంటా. మ కు దీర్ఘం వుండాలి కాదూ!?

ఈ పాట విషయం కాదుగానీ, స్వరంలో ఇమడ్చడంకోసం కొన్ని చోట్ల దీర్ఘాలను హ్రస్వాలుగా, హ్రస్వాలను దీర్ఘాలుగా చేయటం జరుగుతోంది ఈ మధ్య వచ్చే పాటల్లో. డబ్బింగ్ పాటల్లో ఇది మరీ ఎక్కువ.

చైతన్య said...

@Ramanadha Reddy
i am not able to publish u'r comment though mail, for some strange reason.
anduke ila post chesthunnaanu.

thanks for the observing and letting me know. nenu correct chesthanandi...