Wednesday, January 17, 2007
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దొ రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవుల
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఏన్నేన్నో శౄంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హౄదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలదీసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు
***
చిత్రం - నిరీక్షణ
సంగీతం - ఇళయరాజా
సాహిత్యం - రాజశ్రీ
గానం - S P బాలు, S జానకి
Labels:
Aanimutyalu,
archana,
bhanuchandar,
ilayaraja,
jaanaki,
nireekshana,
rajasri,
SP balu
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Wow! Update was worth the wait...
My another all time fav song!
Thanks Chaitanya!
Hey Chaitanya!
Here is the link to the song:
http://www.ramaneeya.com/lovecorner.html#nireekshana
Such a melodiuos song....
I am enjoying it :)
Thanks once again......
మరొక మంచి పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
- కిరణ్
నమస్కారం చైతన్య గారు,
ఈ మధ్య కాస్త పని వొత్తిడి వలన మీ బ్లాగ్ ని చూడటం కుదరలేదు. నా బ్లాగ్ లో కూడా ఏమీ బ్లాగలేక పోయాను. కాస్త సమయం దొరకగానే మళ్ళీ మీ బ్లాగ్ ని చూసా. అదేంటో నాకు ఇష్టమైన, మనసుకు ఎంతో నచ్చిన పాటలు మీ బ్లాగ్ లో ఎన్నో వున్నాయి.
రాజశ్రీ గారు తక్కువ పాటలు రాసినా అవి ఎంతో గొప్పగా రాసారు. రాశికన్నా వాసికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అని ఎక్కడో చదివాను.
"ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో" ఏమని చెప్పగలం ఈ మాటల గురించి? మనసులోని భావాలను అక్షరీకరించడం లో వీరి శైలి భిన్నంగా వుంటుంది.
ఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నాతక్కువే. ఆయన పాట వింటే ఎన్నో వాయిద్యాలు వినిపిస్తాయి కానీ అవి కవి భావాలను (మాటలను) overtake చెయ్యవు. అందుకే ఆయన మాస్ట్రో అయ్యారు.
జానకి గారు, గానగంధర్వుడు బాలూ గారి గళాలలో ఈ పాట ఇంకా అందం గా తయారయ్యి మనలని ఈ రోజుకీ అలరిస్తోంది.
ఇలాంటి మంచి పాటలను బ్లాగ్ లో ఇంకా పెట్టండి..... మీ సంగీత సాహిత్యాభిరుచికి నా అభినందనలు. మీ బ్లాగ్ లో నా బ్లాగ్ పేరు కూడా పెట్టినందుకు ధన్యవాదములు.
భవదీయుడు,
సతీష్ యనమండ్ర
Post a Comment