Friday, January 27, 2006

ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే...

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే


చిత్రం : గుప్పెడు మనసు
వ్రాసిన వారు : ఆచార్య ఆత్రేయ
సంగీతం : M S విశ్వనాథన్

6 comments:

kiraN said...

అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనలోనే
వున్నాయి..

Radhika said...

చాలా మంచి పాట.
మనస్సెంత చంచలమైనదో కదా!
మీ collection బావున్నది చైతన్యగారూ.

రానారె said...

గొప్ప అభిరుచి మీకుంది. ఆకాశవాణి కడప నుంచి చాలారోజులక్రితం విన్నానీపాట. మళ్ళీ ఇక్కడ చూసి పాడుకొంటున్నాను.

Srinivas Kotra said...

hi,
This song sung by Sri Mangalampalli Balamurali Krishna garu.. plz put his name also.

Sky said...

నమస్కారం చైతన్య గారు,
బాలమురళీకృష్ణ గారి గురించి నా బ్లాగ్ లో వ్రాస్తున్నప్పుడు మాటలు కరువై, వెతుకుతుంటే మీ బ్లాగ్ చూడటం జరిగింది. బ్లాగ్ చాల బాగుంది. అనుకోకుండా నేను ఎప్పటినుండో వెతుకుతున్న కొన్ని పాటలు మీ బ్లాగ్ లో దొరికాయి. మీ సంగీతాభిరుచికి నా అభినందనలు.
వీలయితే నా బ్లాగ్ ని కూడా ఒక సారి చూడండి.

భవదీయుడు

సతీష్ యనమండ్ర

సుజ్జి said...

chaitu.. u r blowing me da... nice colletiono f the songs i love to the core.. these shows ur passion towards the music. i wish u all the best.