Tuesday, May 17, 2016

యెక్కిరించు రేయిని సూసి యెర్రబడ్డ ఆకాశం... యెగ్గు పెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం





తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

పాములాంటి సీకటి పడగ దించిపోయింది
భయంనేదు భయంనేదు నిదుర ముసుగు తీయండి
సావులాటి రాతిరి సూరు దాటిపోయింది భయంనేదు భయంనేదు సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండీ 

తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

సురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
సులకనై పోయింది లోకం సీకటికి
కునుకు వచ్హి తూగింది సల్లబడ్డ దీపం
యెనక రెచ్హిపోయింది అల్లుకున్న పాపం
మసక బారిపోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి కాంతుల యెల్లువ గంతులు యెసి

తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

యెక్కిరించు రేయిని సూసి యెర్రబడ్డ ఆకాశం
యెగ్గు పెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల పీడ
సెమట బొట్టు సమురుగా సూరీడ్ని యెలిగిద్దాం
యెలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వేకువ సక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు సేసి

తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో

***

చిత్రం: కళ్ళు 
సంగీతం:  S P బాల సుబ్రహ్మణ్యం 
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 

No comments: