నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శ్రుతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను
నీ జత గూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హ్రుదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హ్రుదయంగమం
నిను చూడక నేనుండలేను
***
చిత్రం: నీరాజనం
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి
సంగీతం: O P నయ్యర్
గీత రచన: C నారాయణ రెడ్డి
Download
3 comments:
ప్చ్.. పాట విందామంటే మా ఆఫీస్ లో కొన్ని సైట్స్ ఫైర్వాల్ చేసారు.
ఇంటికెళ్ళాక వింటా.
-కిరణ్
chalaa manchi paata ..ThnQ
love this song
Post a Comment