పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా... పువ్వు పూయాలా.. రావేలా?
జడ గంటమ్మా...రతనాలమ్మా... జానకమ్మా!
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
పాపికొండలా... పండువెన్నెలా... పక పక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
పాపికొండలా... పండువెన్నెలా... పక పక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా... గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా
నే కుంగిపోవాలా!
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లువే పొంగులు వారాలా
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లువే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు కలిపి ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా
నే కుంగిపోవాలా!
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా... పువ్వు పూయాలా.. రావేలా?
జడ గంటమ్మా...రతనాలమ్మా... జానకమ్మా!
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
***
చిత్రం : జడగంటలు (1984)
గానం : S P బాలసుబ్రమణ్యం, P సుశీల
సంగీతం : పుహళేంది
రచన : --
1 comment:
మంచి పాట.
మీరు పాట ఆడియో కూడా పోస్ట్ లోనే ఇస్తే ఇంకా బాగుంటుంది.
-కిరణ్
Post a Comment